వేణుస్వామి దంపతులు తాజాగా జర్నలిస్ట్ మూర్తి( Journalist Murthy ) 5 కోట్ల రూపాయలు అడిగారంటూ చేసిన సంచలన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.జర్నలిస్ట్ మూర్తి అనుచరుడు అమర్( Amar ) అనే వ్యక్తి ఈ మొత్తం అడిగినట్టు వేణుస్వామి దంపతులు చెబుతున్నారు మాకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వాళ్లు చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి.
చై శోభిత జాతకం గురించి కామెంట్లు చేసిన తర్వాత చాలామందికి వేణుస్వామి( Venuswamy ) టార్గెట్ అయ్యారు.
అయితే జర్నలిస్ట్ మూర్తి మాత్రం వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం లేదని చెబుతున్నారు.
ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అనే ప్రశ్నకు ఇద్దరి వాదన కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జర్నలిస్ట్ మూర్తి పేరుతో ఎవరైనా కావాలని వేణుస్వామి దంపతులపై బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు వేణుస్వామి దంపతుల ఆరోపణలను సుమోటాగా తీసుకుని విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
జర్నలిస్ట్ మూర్తిని దగ్గరినుంచి చూసిన వాళ్లు ఆయన డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి అయితే కాదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ వినిపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.వేణుస్వామి దంపతులు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు.
వేణుస్వామి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వేణుస్వామిపై సోషల్ మీడియాలో మాత్రం వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది.వేణుస్వామి ఇకపై వ్యతిరేకత తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.వేణుస్వామి వివాదాలకు దూరంగా ఉంటే ఆయన కెరీర్ కు మంచిదని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.
మరోవైపు జర్నలిస్ట్ మూర్తి వేణుస్వామి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో వాస్తవాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.