మాదకద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై గణేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ మండలంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగు చేసినట్లుగాని, రవాణా చేసినట్లు, సేకరిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లుగాని సమాచారం తెలిస్తే వెంటనే ఈ నెంబర్ కు (8712656392) సమాచారం తెలిపాలని సూచించారు.

 Si Ganesh Who Made The Villagers Aware Of Drug Eradication, Si Ganesh , Villager-TeluguStop.com

మీ ఏమైనా సమాచారం తెలిస్తే నంబర్ ను గోప్యంగా ఉంచుతామని వారికి కౌన్సెలింగ్ ఇస్తామని అన్నారు.గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ భూమయ్య.రాజశేఖర్, కాసిం హోంగార్డు వెంకటి మనోహర్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube