పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాని.. వాళ్లంటే పిచ్చి ప్రేమ అంటూ?

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని ( Nani ) ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సరిపోదా శనివారం(Saripoda Shanivaram) .ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Nani Interesting Comments On Pawan Kalyan , Nani, Pawan Kalyan, Saripoda Sanivar-TeluguStop.com

ఇక ఈ సినిమాలో సీనియర్ డైరెక్టర్ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Ap Deputy Cm, Nani, Pawan Kalyan, Suma, Tollywood, Vivek Athreya-Movie

ఇక ఏదైనా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే తప్పనిసరిగా యాంకర్ సుమ(Suma)తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయడం అలాగే ఆమె యాంకర్ గా సినిమా ఈవెంట్లు చేయడం జరుగుతూ ఉంటుంది.తాజాగా యాంకర్ సుమతో కలిసి నాని ప్రియాంక మోహన్ యస్ జె సూర్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వారి కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు అంతేకాకుండా నాని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap Deputy Cm, Nani, Pawan Kalyan, Suma, Tollywood, Vivek Athreya-Movie

ఈ సందర్భంగా సుమ నానిని ప్రశ్నిస్తూ హీరో పవన్ కళ్యాణ్ గారిలోనూ మీలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నాకు సినిమాలంటే చాలా పిచ్చి ప్రేమ ఉంది.ఇక పవన్ కళ్యాణ్ గారికి మాత్రం జనాలు అంటే చాలా పిచ్చి ప్రేమ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తూ రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube