బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీమంత్రి కేటీఆర్ పై( KTR ) కాంగ్రెస్ సీనియర్ నేత , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడుతున్న కేటీఆర్ ను టార్గెట్ చేసుకున్న భట్టి అనేక అంశాలను ప్రస్తావించారు.
రాష్ట్ర విభజన తరువాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారు తమ వల్లే ఈ రాష్ట్రంలో , ఈ దేశంలో ఐటీ సెక్టర్ లో అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నామని కొంతమంది చెప్పుకుంటున్నారని , వారు గత చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి భట్టి విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఐటీ సెక్టర్ లో ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతున్నాయంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) తీసుకున్న నిర్ణయాలే కారణమని భట్టి అన్నారు.
ఇటీవల సీఎం బృందం అమెరికా , దక్షిణ కొరియాలో పర్యటించి 36వేల కోట్ల పెట్టుబడులను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నారని, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంటే.ఎంవోయుల కోసం అక్కడ వరకు వెళ్లాలా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని భట్టి మండిపడ్డారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని వస్తేనే పెట్టుబడులు వస్తాయని, అలా కాకుండా మీకు మాదిరిగా ఎక్కడో కోటలో, గడిలో కూర్చుని మాట్లాడితే పెట్టుబడులు వచ్చేవి రాష్ట్రానికి కాదని, మీకు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ పై( BRS ) విమర్శలు చేశారు.హైదరాబాద్ లో మీరు ఆక్రమించిన చెరువులు , కుంటలను, భూములను తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, హైడ్రాతో( Hydra ) చెరువులు, పార్కుల ఆక్రమణలు తొలగించి ఈ నగర ప్రజలకు కానుక ఇవ్వబోతున్నామని , రుణమాఫీ విషయంలో.
బీఆర్ఎస్ సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఈ విమర్శలు చేశారు.దేశంలో రాజీవ్ గాంధీ( Rajiv Gandhi ) కంప్యూటర్ యుగాన్ని సృష్టించారని, ప్రతి పల్లెకు మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకు వచ్చారని, యువత దేశ పరిపాలనలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా భట్టి అన్నారు.