1.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది.
2.చంద్రబాబు కి కేంద్రం ఆహ్వానం
టీడీపీ అధినేత చంద్రబాబు కు కేంద్రం ఆహ్వానం పంపింది.ఢిల్లీలో జరిగే ఆజాదీ కా ‘అమృత్ మహోత్సవ్ ‘ జాతీయ కమిటీ సమావేశం లో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పంపింది.
3.టీటీడీ కి రికార్డ్ స్థాయి ఆదాయం
తిరుమల శ్రీవారి ఆదాయం రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది.జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 139.45 కోట్లుగా వచ్చింది.
4.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.నేటి నుంచి తెలంగాణ ఇంటర్, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి.
6.వంగవీటి రాధా తో కేశినేని చిన్ని
విజయవాడ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఈ రోజు విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తో భేటీ అయ్యారు.
7.గజ్వేల్ లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు
అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లోని ఓ ఆడిటోరియం లో 500 మంది తల్లులతో నిర్వహించారు.
8.ఢిల్లీకి ఈటెల, డీకే అరుణ
హుజురాబాద్ బిజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పార్టీలో చేరికల జాబితా తో బిజెపి పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.
9.కేసీఆర్ పై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాసర విద్యార్థులపై కేసీఆర్ ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ సంజయ్ మండిపడ్డారు.
10.హాస్యనటుడు సారథి మృతి
తెలుగు సినీ పరిశ్రమ లు విషాదం చోటుచేసుకుంది.ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు.
11.చంద్రబాబుపై రోజా కామెంట్స్
కుప్పం ను మున్సిపాలిటీ చేయలేనివాడు ముంపు గ్రామాలను జిల్లా చేస్తాడంటూ టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా సెటైర్స్ వేశారు.
12.తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను 36 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.రేట్ల ప్రకారం సిలిండర్ ధర 1976.50 కి చేరింది.
13.జగన్ పై సిపిఐ నారాయణ కామెంట్స్
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం జగన్ పై కామెంట్ చేశారు.సంపూర్ణ మధ్య నిషేధం చేపడతామని గతంలో జగన్ పదేపదే చెప్పారని ఇప్పుడు దానిని అమలు చేయడం లేదని నారాయణ విమర్శించారు.
14.శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు
15.ఒడిషా అడవుల్లో అరుదైన నల్ల పులి
అతి అరుదైన బ్లాక్ టైగర్ ఒడిశా లోని సిమిలి పాల్ నేషనల్ పార్క్ లో అరుదైన జాతికి చెందిన సిమిలి పాల్ పార్క్ లో అరుదైన జాతికి చెందిన నల్ల పులి కెమెరాకు చిక్కింది.
16.ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు.జూబ్లీహిల్స్ లోని నివాసం లోనే ఆమె కన్నుమూశారు.
17.ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలు
ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్నాయి.ఢిల్లీలో ఇద్దరికీ మంకీ ఫాక్స్ లక్షణాలు కనిపించడంతో వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.
18.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులు 16 మందికి బెయిల్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన అల్లర్ల కేసులు నిందితులుగా ఉన్న వాళ్లల్లో 16 మందికి హైకోర్టు మంజూరు చేసింది.
19.చికోటి ప్రవీణ్ ను విచారిస్తున్న అధికారులు
క్యాసినో కేసులో అరెస్ట్ అయిన చీకోటి ప్రవీణ్ ను ఈడి అధికారులు విచారిస్తున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,380
.