అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) అనూహ్య పరిణామాల మధ్య ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు.అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో పార్టీ సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెళ్తూ వెళ్తూ కమలా హారిస్( Kamala Harris ) అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు.ఈ నిర్ణయం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా పార్టీ కోసం తప్పలేదు.
అయితే ఆ తర్వాతి నుంచి బైడెన్ ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు.ఇది జనంలో తప్పుడు సంకేతాలు పంపడమే కాక.పార్టీ నేతలు ఐకమత్యంగా లేరని భావన కలుగుతోంది.ఇది గమనించిన కమలా హారిస్.
ఇటీవల జరిగిన ఓ ప్రచార ర్యాలీలో జో బైడెన్‌తో కలిసి వేదిక పంచుకున్నారు.

ఇదిలాఉండగా.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌ను అధికారికంగా ఎన్నుకునేందుకు గాను చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్( Democratic Party National Convention ) జరుగుతోంది.ఈ కార్యక్రమానికి జో బైడెన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అమెరికాలో రాజకీయ హింసకు తావులేదన్నారు.
ట్రంప్( Trump ) హయాంలో ఏ నిర్మాణం జరగలేదని.సరైన మౌలిక వసతులు లేకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్ధగా నిలవలేమని బైడెన్ పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక రోడ్లు, వంతెనలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైళ్లు, బస్సులను ఆధునికీకరించామని అధ్యక్షుడు వెల్లడించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన చిన్నారులు తుపాకులకు బలవుతున్నారని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.నా బాధ్యతలు, ఆశయాలను హరిస్- వాల్జ్ కొనసాగిస్తారని.వీరిద్దరికి అత్యుత్తమ వాలంటీర్‌లా పనిచేస్తానని బైడెన్ తెలిపారు.
అంతకుముందు జో బైడెన్ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.ఆయన కుమార్తె యాష్లీ బైడెన్( Ashley Biden ) మాట్లాడుతూ.
తన తండ్రి మహిళల పక్షపాతని, వారికి విలువనివ్వడం, నమ్మడం తాను చూశానని చెప్పడంతో బైడెన్ కన్నీటి పర్యంతమయ్యారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.