కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) అనూహ్య పరిణామాల మధ్య ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు.

అనారోగ్యం, వృద్ధాప్య సమస్యల నేపథ్యంలో పార్టీ సూచనల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

వెళ్తూ వెళ్తూ కమలా హారిస్( Kamala Harris ) అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు.

ఈ నిర్ణయం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా పార్టీ కోసం తప్పలేదు.అయితే ఆ తర్వాతి నుంచి బైడెన్ ఎక్కడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు.

ఇది జనంలో తప్పుడు సంకేతాలు పంపడమే కాక.పార్టీ నేతలు ఐకమత్యంగా లేరని భావన కలుగుతోంది.

ఇది గమనించిన కమలా హారిస్.ఇటీవల జరిగిన ఓ ప్రచార ర్యాలీలో జో బైడెన్‌తో కలిసి వేదిక పంచుకున్నారు.

"""/" / ఇదిలాఉండగా.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్‌ను అధికారికంగా ఎన్నుకునేందుకు గాను చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌( Democratic Party National Convention ) జరుగుతోంది.

ఈ కార్యక్రమానికి జో బైడెన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

అమెరికాలో రాజకీయ హింసకు తావులేదన్నారు.ట్రంప్( Trump ) హయాంలో ఏ నిర్మాణం జరగలేదని.

సరైన మౌలిక వసతులు లేకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్ధిక వ్యవస్ధగా నిలవలేమని బైడెన్ పేర్కొన్నారు.

"""/" / తాము అధికారంలోకి వచ్చాక రోడ్లు, వంతెనలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైళ్లు, బస్సులను ఆధునికీకరించామని అధ్యక్షుడు వెల్లడించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన చిన్నారులు తుపాకులకు బలవుతున్నారని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా బాధ్యతలు, ఆశయాలను హరిస్- వాల్జ్ కొనసాగిస్తారని.వీరిద్దరికి అత్యుత్తమ వాలంటీర్‌లా పనిచేస్తానని బైడెన్ తెలిపారు.

అంతకుముందు జో బైడెన్ వేదికపై భావోద్వేగానికి గురయ్యారు.ఆయన కుమార్తె యాష్లీ బైడెన్( Ashley Biden ) మాట్లాడుతూ.

తన తండ్రి మహిళల పక్షపాతని, వారికి విలువనివ్వడం, నమ్మడం తాను చూశానని చెప్పడంతో బైడెన్ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాల కథలు ప్రేక్షకులకు అర్థం కాకనే ఫ్లాప్ అయ్యాయి..?