బైక్‌పై నుంచి కింద పడిన పేరెంట్స్.. పిల్లోడితో అర కి.మీ ఉరికిన బైక్..?
TeluguStop.com
సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురైతే తీవ్రమైన గాయాలు అవుతాయి.కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు కానీ ఇటీవల జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్( Bike Accident ) సంఘటనలో అలా ఏం జరగలేదు.
దేవుడు రక్షణగా ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సురక్షితంగా బయటపడవచ్చు అని పెద్దోళ్ళు అంటుంటారు.
ఈ సంఘటన గురించి తెలుసుకుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గానూ మారింది.
"""/" /
వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక కపుల్ పిల్లోడిని( Kid ) బైక్ ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చోబెట్టి రోడ్డుపై బయలుదేరారు.
వాళ్లు అలా బైక్ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ముందున్న స్కూటీని( Scooter ) ఢీ కొట్టారు.
ఈ ఘటనను వెనకాల వెళ్తున్న మరొక కారులోని డాష్‌క్యామ్ కెమెరా రికార్డ్ చేసింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తల్లిదండ్రులు( Parents ) కింద పడిపోయారు.కానీ ఆశ్చర్యకరంగా, బైక్ మీద ఉన్న పిల్లవాడు మాత్రం కింద పడకుండా బైక్‌పైనే కూర్చుని ఉండిపోయాడు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ బైక్ పిల్లవాడితో సహా దాదాపు అర కిలోమీటరు దూరం వరకు ఒంటరిగా వెళ్లింది.
"""/" /
బైక్ చివరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.అప్పుడు పిల్లవాడు బైక్( Bike ) నుంచి పొదల్లో పడ్డాడు.
కొంత సేపటికి కొంతమంది అక్కడకు వచ్చి పిల్లవాడిని తీసుకున్నారు.ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఆ బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.
అయితే బైక్ మరొక వాహనాన్ని ఢీకొంటే పిల్లవాడి ప్రాణానికి ముప్పు వచ్చేది.కానీ అదృష్టం కొద్దీ అలా జరగలేదు.
అయితే ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.@HasnaZarooriHai అనే ట్విట్టర్ అకౌంట్ దీన్ని షేర్ చేసింది బైక్ అతివేగంతో వెళ్లడం వల్లే రైడర్ అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొట్టినట్లు వీడియో చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు.
అలాగే ఆ బాలుడు చాలా లక్కీ అని అంటున్నారు.
మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉంటూ ఐఏఎస్.. నేహా బైద్వాల్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!