టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
అలాగే తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో కూడా నిలుస్తూనే ఉంటారు బాలయ్య బాబు.కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయపరంగా కూడా సక్సెస్ అవుతూ దూసుకుపోతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు రక్షాబంధన్ వేడుకలను( Rakshabandhan celebrations ) ఎంతో సంతోషంగా జరుపుకున్న విషయం తెలిసిందే.తన సోదరీమణులు లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి లతో రాఖీ కట్టించుకున్నారు.
ఈ సందర్భంగా బాలయ్య చేసిన అల్లరి మాములుగా లేదు.అక్క చెల్లెమ్మలను ఆట పట్టిస్తూ బాలయ్య చేసిన సందడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఆ సందర్భంలో అక్క పురందేశ్వరి.బాలయ్య గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.ఈ ఆడియో క్లారిటీ లేకపోవడంతో పురందేశ్వరి ఏం చెప్పారో చాలా మందికి అర్థం కాలేదు.ఇంతకీ ఆ వీడియోలో పురందేశ్వరి( Purandeshwari ) ఏం చెప్పింది అన్న విషయానికి వస్తే.
తమకి ఆప్యాయంగా రాఖీ కట్టిన అక్కచెల్లెమ్మలకి ప్రేమగా బహుమతి కానీ డబ్బు కానీ అన్నదమ్ములు ఇవ్వడం తెలిసిందే.అయితే ఈ వీడియోలో తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి ( Lokeshwari )ముందుగా డబ్బులిచ్చారు బాలయ్య.
అయితే ఆ తర్వాత రాఖీ కట్టిన పురందేశ్వరి,భువనేశ్వరిలకి( Purandeshwari, Bhubaneswari ) అక్క లోకేశ్వరికి ఇచ్చిన అదే డబ్బును మళ్లీ తీసేసుకొని రిటర్న్ ఇచ్చారు.
ఇది చూసిన వెంటనే పురందేశ్వరి బాలయ్యను ఒక రేంజ్లో ఆటపట్టించారు.ఛీఛీ.ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడు.
ఒకసారి బెగ్గర్ కి చిన్నప్పుడు 10 పైసలు వేశాడు.అది చూసి మరీ 10 పైసలు ఏంట్రా అంటూ అమ్మ అడిగితే ఆ బిచ్చగాడికి వేసిన 10 పైసలు వెనక్కి తీసేసుకొని మళ్లీ వేశాడు అని పురందేశ్వరి తెలిపారు.
ఇది విని అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.నారా భువనేశ్వరి అయితే బాలయ్య అల్లరికి ఒకటే నవ్వు.
ఇక రాఖీ కట్టిన అక్కలిద్దరి కాళ్లకి సతీసమేతంగా దండం పెట్టారు బాలయ్య.చెల్లి భువనేశ్వరిని ఆప్యాయంగా హత్తుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.