ఒక సినిమా హిట్ కావాలంటే అందులో స్టోరీ గొప్పగా ఉండటమే కాదు అది ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా ఉండాలి.లేకపోతే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అందుకోక తప్పదు.
కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకపోవడంతో అవి ఫ్లాప్ అయ్యాయి.అవి ఏవో తెలుసుకుందాం.
• సాహో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన సాహో మూవీ( Saaho ) హాలీవుడ్ లెవెల్ లో ఉంటుంది స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు కానీ ప్రేక్షకులకు ఇది అర్థం కాలేదు.అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.
• కోబ్రా
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది.కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి స్టోరీ అర్థం చేసుకోలేక ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు.అందువల్ల ఈ మూవీ పెద్దగా ఆడలేదు.
• వన్: నేనొక్కడినే
వన్ నేనొక్కడినే( One Nenokkadine ) సినిమా చాలా బాగుంటుంది.అయితే అప్పటి ప్రేక్షకులకు ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు అర్థం చేసుకునే స్థాయిలో ఉండకపోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయ్యి అయింది.
• పొన్నియన్ సెల్వన్
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1( Ponniyin Selvan 1 ) సినిమా తమిళనాడులో హిట్ అయింది కానీ మన తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది.ఎందుకంటే ఈ మూవీలో క్యారెక్టర్స్, వారి మధ్య ఉన్న లింక్ అనేది చాలామందికి కన్ఫ్యూజింగ్‌గా అనిపించింది.పాత్రలు పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటాయి.
మణిరత్నం తీసిన ఈ సినిమా తమిళ వాళ్లకు బాగా అర్థమయింది కానీ తెలుగు వారికి ఆ మూవీ స్టోరీ గురించి పెద్దగా అవగాహన లేక ఇది ఫ్లాప్ అయ్యింది.
• అ!
నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన అ! సినిమా( Awe Movie ) చాలా బాగుంటుంది.క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు.కానీ ఆ క్లైమాక్స్ అనేది చాలామందికి అర్థం కాలేదు.
అందువల్ల ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.
• ఖలేజా మూవీ
మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా మూవీలో( Khaleja ) కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.మహేష్ చాలా బాగా నవ్విస్తాడు కూడా.కానీ స్టోరీలో క్లారిటీ అనేది మిస్ అయింది.
ఒక ప్రేక్షకుడికి ఈ సినిమా ద్వారా త్రివిక్రమ్ ఏం చెప్పదలుచుకున్నాడో సరిగ్గా చెప్పలేకపోయాడు.అప్పటి ప్రేక్షకులు కూడా దీని అర్థం చేసుకోలేకపోయారు.