ఎండాకాలం రావడంతో ఈ వేడికి తట్టుకోలేక చాలామంది చల్లటి నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారు.దీనికోసం ఫ్రిజ్ లో నీటి బాటిల్లను పెట్టి అవసరమైనప్పుడు తాగుతున్నారు.
అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఇటీవల కాలంలో చాలా మంది రాగి బిందెలు, రాగి గ్లాసులు( Copper pots, copper glasses ), రాగి నీళ్ల బాటిళ్లలో నిల్వ ఉంచిన నీళ్లను తాగుతున్నారు.అయితే సాధారణంగా ఫ్రిజ్లో మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లనే ఎక్కువగా ఉంచుతాం.
అయితే రాగి పాత్రను ఫ్రిడ్జ్ లో ఉంచవచ్చా? రాగి పాత్రలను ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయితే రాగి నీరు తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎందుకంటే ఈ నీటిలో హానికరమైన సూక్ష్మజీవులు, శిలీంద్రాలు, బ్యాక్టీరియా( Microorganisms, fungi, bacteria ) లాంటి వాటిని సహజంగా నశింపజేస్తుంది.కాబట్టి శతాబ్దాలుగా రాగి పాత్రలలో నీరు తాగడం అనేది కొనసాగుతుంది.
ఇక నిపుణుల ప్రకారం రాగి బాటిల్లను ఫ్రిడ్జ్ లో అస్సలు నిల్వ చేయకూడదు.ఎందుకంటే రాగి బాటిల్ ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల పెద్దగా నష్టాలు కలగకపోయినప్పటికీ ప్రయోజనాలు కూడా అస్సలు కలగవు.

ఎందుకంటే రాగి బాటిల్ ను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు మాత్రమే అందులోని రాగి మూలకాలు నీటిలో కలుస్తాయి.శీతలీకరణ ఆల్కలీనైజేషన్ ప్రక్రియను జరగనివ్వదు.అంతేకాకుండా ఆ రాగి పాత్రలో తాగే నీటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు.అంత చల్లటి నీరు తాగాలనిపిస్తే ఫ్రిడ్జ్ నీటిని రాగి పాత్రలో పోసి నిలువ చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
మిగతా పాత్రల కంటే మరింత చల్లగా చాలా కాలం పాటు ఉంటుంది.రాగి బాటిల్లని గది ఉష్ణోగ్రత వద్ద శుభ్రమైన ప్రదేశంలో నిల్వ చేయాలి.

అయితే రాగి నీటిని సంస్కృతంలో తామ్రజల్ అని అంటారు.ఆయుర్వేదం ప్రకారం తామ్రజల్ తాగడం శరీరానికి చాలా మంచిది.ఇక రాత్రిపూట రాగీ పాత్రలో నీటిని ఉంచి ఉదయాన్నే తాగడం మరింత ఆరోగ్యకరం.సుమారు 8 గంటలకు పైగా రాగి పాత్రలో నీరు నిర్వహించినప్పుడు అందులో కొద్ది మొత్తంలో రాగి అయాన్లు ఆ నీటిలో కరిగిపోతాయి.
ఆ ప్రక్రియను ఒలిగో డైనమిక్ ఎఫెక్ట్ అని అంటారు.ఇది హానికరమైన సూక్ష్మజీవులు, శిలీంద్రాలు మొదలైనటువంటి వాటిని నాశనం చేస్తుంది.