టాలీవుడ్ ప్రేక్షకులకు తెగ ఇరిటేషన్ తెప్పించిన మూవీ క్యారెక్టర్లు.. ఏవంటే..?

సాధారణంగా సినిమాల్లో చాలా క్యారెక్టర్లు కీలక పాత్ర పోషిస్తుంటాయి.అయితే కథ ఎంత బాగున్నా కొన్ని క్యారెక్టర్లు అనేవి ప్రేక్షకులకు అసలు నచ్చవు.

 Characters Which Are Irritated People Rakul Rashmika Tamanna Details, Rakul Pree-TeluguStop.com

ఆ క్యారెక్టర్ స్క్రీన్ పై కనిపించగానే ఇరిటేషన్ వచ్చేస్తుంది.కొన్నిసార్లు దర్శకులు ఇలాంటి బీపీ తెప్పించే క్యారెక్టర్లను సినిమా మొదల నుంచి చివరి వరకు ఉంచుతారు.

ఆ ఇరిటేషన్ క్యారక్టర్లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.తెలుగు సినిమాల్లో అటువంటి కొన్ని చిరాకు పుట్టించే కొన్ని మూవీ రూల్స్ ఉన్నాయి.అవి ఏవో తెలుసుకుందాం.

• రారండోయ్ వేడుక చూద్దాం

నాగచైతన్య, రకుల్ ప్రీత్‌ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) యాక్ట్ చేసింది.అయితే ఈ క్యారెక్టర్ చాలామందికి బీపీ తెప్పించిందనే చెప్పాలి.ఈ రోల్ అనేది హీరోకి ఇరిటేషన్ తెప్పించే లాగా డైరెక్టర్ రాసుకున్నాడు.ఈ రోల్‌ చాలా ఓవర్‌గా మాట్లాడుతుంది.

దీన్ని ఒక అతి క్యారెక్టర్ అని కూడా చెప్పవచ్చు.అందువల్లే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు హీరోయిన్ కనిపించగానే సర్రున బీపీ పెరిగిపోయింది.

Telugu Rakshasudu, Rarandoiveduka, Rebel, Suzane George, Tamanna-Movie

• రష్మిక మందన్న – సరిలేరు నీకెవ్వరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ మూవీ “సరిలేరు నీకెవ్వరు”లో( Sarileru Neekevvaru ) మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.“సంస్కృతీ” పాత్రలో రష్మిక మందన్న( Rashmika Mandanna ) ఒక అల్లరి పిల్లలాగా నటించింది.నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్‌ ఆఫ్టర్ అంటూ రష్మిక ఈ మూవీలో వెరైటీగా యాక్ట్ చేసింది.ఈమె రోల్ చాలామందికి నచ్చితే కొంతమందికి మాత్రం ఇరిటేషన్ తెప్పించిందట.కొందరైతే ఆమె క్యారెక్టర్ తమకు బీపీ కూడా తెప్పించిందని కామెంట్లు చేశారు.నిజానికి రష్మిక సినిమాలో లేకపోయినా స్టోరీ పై ఎలాంటి నెగటివ్ ఎఫెక్టు ఉండేది కాదు.

కానీ దర్శకుడు F2లోని హనీ క్యారెక్టర్ లాగానే రష్మిక క్యారెక్టర్ ను రాసుకొని ప్రేక్షకులను నవ్వించాలనుకున్నాడు.కానీ అది బ్యాక్ ఫైర్ అయింది.

Telugu Rakshasudu, Rarandoiveduka, Rebel, Suzane George, Tamanna-Movie

• రాక్షసుడు – పోలీస్ క్యారెక్టర్

రాక్షసుడు (2019)( Rakshasudu ) సినిమాలో ఏసీపీ లక్ష్మీ ఐపీఎస్‌గా సుజాన్ జార్జ్( Suzane George ) నటించిన సంగతి తెలిసిందే.అయితే ఈ క్యారెక్టర్ సైకో క్యారెక్టర్ కంటే ఎక్కువ ఇరిటేషన్ తెప్పిస్తుంది.

Telugu Rakshasudu, Rarandoiveduka, Rebel, Suzane George, Tamanna-Movie

• తమన్నా రెబల్ మూవీ

రెబల్ సినిమాలో తమన్నా( Tamanna ) క్యారెక్టర్ ఫస్టాఫ్ వరకు బాగానే ఉంటుంది.కానీ క్లైమాక్స్ లో మాత్రం తమన్నా క్యారెక్టర్ చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube