సాధారణంగా కొందరి స్కిన్ చాలా ఆయిలీగా ఉంటుంది.ఆయిల్ స్కిన్ కారణంగా మొటిమలు, మచ్చలు వంటివి ఎక్కువగా ఏర్పడుతుంటాయి.
అలాగే ఆయిలీ స్కిన్( Oily Skin ) వల్ల ముఖంలో గ్లో తగ్గుతుంది.చర్మం ఎప్పుడూ జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంటుంది.
ఈ క్రమంలోనే ఆయిలీ స్కిన్ ను వదిలించుకునేందుకు రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.ఈ రెమెడీతో ఆయిలీ స్కిన్ కి సులభంగా బై బై చెప్పవచ్చు.
చర్మాన్ని అందంగా మెరిపించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ పీల్ పౌడర్( Lemon Peel Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, రెండు టేబుల్ స్పూన్లు తేనె మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.చర్మం ఎక్కువ సమయం పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.
ఆయిలీ స్కిన్ క్రమంగా దూరం అవుతుంది.అలాగే లెమన్ పీల్ పౌడర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పని చేస్తుంది.
మృత చర్మ కణాలను తొలగిస్తుంది.చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపిస్తుంది.
చందనం పొడి ముడతలను నివారించడానికి, మొటిమలను తగ్గించడానికి, నల్ల మచ్చలను మాయం చేయడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఇక అలోవెరా జెల్, తేనె, రోజ్ వాటర్ వంటివి చర్మాన్ని స్మూత్ గా షైనీగా మారుస్తాయి.