ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) అలాగే డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చర్చించుకుంటున్నారు.ఇటీవల ఈ ఎందుకు ఈ సినిమాను గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే వీటిలో ప్రభాస్( Prabhas ) తో పాటు హీరోయిన్ ఇమాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.ఇక ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ ఆమె గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.
ఈమె సోషల్ మీడియా స్టార్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో కథానాయికగా ఆమెను ఎంచుకోవడం పై దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొత్త టాలెంట్ ను వెలికితీయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తమ కథకు అనుగుణంగా నటీ నటులను ఎంపిక చేసుకోవడంలో ఫిల్మ్‌మేకర్స్( Filmmakers ) కు సోషల్ మీడియా ఎంతో సాయం చేస్తుంది.ఇమాన్వీ( Imanvi ) అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి.
అందరిలాగానే నేనూ ఆమె డ్యాన్స్ వీడియోలు చూస్తుంటాను.ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్.
కళ్లతోనే ఎన్నో హావ భావాలను పలికిస్తుంటుంది.అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను అని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు.
ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్( Auditions, screen test ) అనంతరమే ఆమెను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.ఆమెను సెలెక్ట్ చేయడం తన ఒక్కడి నిర్ణయం కాదని చిత్ర బృందం మొత్తం నిర్ణయమని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఇమాన్వీ ని అలాగే డార్లింగ్ ప్రభాస్ ని పక్కపక్కన చూసి మంచి పేరు బెస్ట్ జోడి అంటూ కామెంట్ల కురిపిస్తున్నారు అభిమానులు నెటిజెన్స్.
ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకుం ముందే ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.