మనిషి అనేవారికి ఎవరికైనా తుమ్ములు రావడం సహజం…జలుబు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ తుమ్ములు వస్తుంటాయి.సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే తుమ్ములు ఆపుకోవచ్చు కానీ జలుబు అప్పుడు వెంటవెంటనే వచ్చే తుమ్ముల్ని వాటిని ఎవరూ ఆపలేరు.
కానీ జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను కొంత వరకు ఆపవచ్చు.తుమ్ము రావడానికి గల ముఖ్య కారణాలు అలర్జీలు, దుమ్ము.
అయితే ఎవరు, ఎప్పుడు, ఎలా తుమ్మినా కచ్చితంగా కళ్లు మూసుకునే తుమ్ముతారు.కళ్లు తెరచి ఎవరూ తుమ్మరు.
అలా కళ్లు తెరిచి తుమ్మితే కను గుడ్లు బయటికి పడతాయని అధిక శాతం మంది నమ్ముతారు.కానీ అందులో నిజమెంత.
తుమ్ము వచ్చేది ముక్కు ద్వారా అలాంటప్పుడు కళ్లకి ఏంటి సంభందం.తెలుసుకోండి.
తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం అంటే కళ్లకి,ముక్కుకి ఏదో సంభందం ఉంది అనుకుంటున్నారా?కానీ కంటి నరాలకు, ముక్కు నరాలకు డైరెక్ట్‌గా సంబంధం ఏమీ ఉండదు.అయితే తుమ్మినప్పుడు మాత్రం ఓ నాడి మెదడుకు సిగ్నల్ పంపుతుంది.
దాంతో మనం ఆటోమేటిక్‌గా కళ్లు మూసుకుంటాం.అయితే అలా కళ్లు మూసుకోవడం మంచిదే.
ఎందుకంటే తుమ్మినప్పుడు మన ముక్కు నుంచి వచ్చే బాక్టీరియా, వైరస్‌లు కళ్లలోకి వెళ్లకుండా ఉంటాయి.
దాదాపుగా చాలా తక్కువ మంది మాత్రమే కళ్లు తెరచి కూడా తుమ్మగలరు.కళ్లు తెరచి తుమ్మడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు.తుమ్ము ఎంత వేగంగా వచ్చినా కళ్లు తెరిచి తుమ్మితే దాంతో కళ్లు మాత్రం బయట పడవు.
ఎందుకంటే పైనే చెప్పాం కదా, కళ్లకు, ముక్కుకు డైరెక్ట్‌గా సంబంధం ఉండదని.కళ్లు ఆరు రకాల extra-ocular కండరాలతో నిర్మాణమవుతాయి.కాబట్టి అవి అంత తేలిగ్గా ఊడి బయట పడవు.వాటి స్థానంలో కళ్లు చాలా గట్టిగా, దృఢంగా పాతుకునిఉంటాయి.
అర్దమైందా కళ్లు తెరిచి తుమ్మినా కనుగుడ్లు ఊడిపడవని.తుమ్మే సమయంలో ఎంత తెరచి ఉంచినా కచ్చితంగా మనం కళ్లు మూసుకుంటాం.