నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని…( Nani ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే ‘సరిపోదా శనివారం’( Saripodhaa Sanivaaram ) అనే సినిమా చేయడమే కాకుండా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు.
ఈయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి… ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.అలాగే ఇప్పుడు ఆయన సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అయితే ఈ సినిమా దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయతో( Vivek Athreya ) ఇంతకుముందే అంటే సుందరానికి( Ante Sundaraniki ) అనే సినిమా చేశాడు.అయినప్పటికీ ఆ సినిమా కూడా సక్సెస్ ను అందుకోలేకపోయింది.
అయినప్పటికీ నాని వివేక్ కి మరొక అవకాశాన్ని ఇచ్చాడు.అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మొత్తానికైతే నాని ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో ఒక పెద్ద సాహసం చేస్తున్నాడు.మరి ఈ సినిమా కనక తేడా కొడితే అటు నానికి, ఇటు వివేక్ ఆత్రేయ ఇద్దరికీ కెరియర్ల పరంగా భారీ డ్యామేజ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి.
చూడాలి మరి ఈ సినిమాలు వీళ్లిద్దరి కెరియర్లను నిలబెడుతుందా లేదంటే అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ అవుతుందని చాలామంది మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు.
అయినప్పటికీ ఈ సినిమాలో దమ్ముందా లేదా అనేది మాత్రం ప్రేక్షకులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.ఇక నానిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు అది ఏంటి అంటే తను ఒక దర్శకుడిని నమ్మితే అతనికి వరుసగా కొన్ని ఆఫర్లు అయితే ఇస్తాడు.ఇక అలాంటి కోవకే వివేక్ ఆత్రేయ చెందుతాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.