మామూలుగా అభిమానులు హీరో హీరోయిన్ల పై ఉన్న పిచ్చి అభిమానంతో కొన్ని కొన్ని సార్లు వారికి ఇబ్బంది కలిగే విధంగా కూడా చేస్తూ ఉంటారు.ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీలకు కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
అభిమానం పిచ్చి పరాకాష్టకు చేరినప్పుడు సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగే విధంగా కూడా అభిమానులు ప్రవర్తిస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా డార్లింగ్ ప్రభాస్( Darling Prabhas ) ఒక అభిమాని పిలిచినా పిలుపుకి విని షాక్ అయ్యాడు.
అసలు ఏం జరిగిందంటే.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా( Back to back Pan India ) సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు డార్లింగ్ ప్రభాస్.దాంతో ప్రభాస్ పేరు ఎక్కడ చూసినా కూడా మారుమోగుతోంది.అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.వీడియో పాతదే అయినప్పటికీ ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడంతో అది కాస్త ట్రెండింగ్ వీడియో అయిపోయింది.
ఈ వీడియోలో ప్రభాస్ తన ఫ్యాన్స్‌ను కలిసేందుకు రాగా ఇంతలో ఒక అభిమాని ఆప్యాయంగా పలకరించాడు.అయితే అతను పిలిచిన విధానం చాలా బావుంది.
అన్నా భీమవరం వత్తావా ( Bhimavaram Vattava )అంటూ పక్కా గోదారి యాసలో ఆ మాట వినేసరికి పభాస్ వెనక్కి తిరిగి భలే లుక్ ఇచ్చారు.వీడెవడో మన గోదారి ఫ్యాన్ లా ఉ్ననాడే అన్నట్లుగా ప్రభాస్ చూస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో పై నేటిజన్స్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.అభిమాని పిలుపు బాగుంది ప్రభాస్ రియాక్షన్ ఇంకా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా సినిమాలో ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.