కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో నటుడు రిషబ్ శెట్టి ఒకరు.ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటించడమే కాకుండా దర్శకుడుగా పనిచేశారు.
అయితే ఇటీవల రిషబ్ శెట్టి ( Rishabh Shetty )జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక అయిన సంగతి మనకు తెలిసిందే.ఈయన స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమాలో ఈయన నటనకు గాను జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు ( Award for Best Actor )అందుకోబోతున్నారు.
ఇలా ఈయనకు ఈ అవార్డు రావడంతో ఎంతోమంది ఈయనపై ప్రశంశలు కురిపిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టి బాలీవుడ్ సినిమాల( Bollywood movies ) గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఒకానొక సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలనే ఇండియన్ సినిమాలుగా భావించేవారు దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇతర భాష చిత్రాలను చాలా తక్కువ చేసి చూసేవారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాల గురించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.కొన్ని భారతీయ చిత్రాలు ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి.మన సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తుంది.
రెడ్ కార్పొరేట్ వేస్తారు అందుకే నేను చేసే సినిమాలు అన్నింటిలో కూడా నా దేశాన్ని ఎంతో గర్వంగా చూపించే సినిమాలు చేస్తానని తెలిపారు.అంతేకాకుండా నా దేశం, నా రాష్ట్రం, నా భాష గురించి ప్రపంచానికి చాలా గొప్పగా చెప్పాలనుకుంటున్నానని, ఇలాంటి సినిమాలనే తాను చేస్తాను అంటూ ఈయన బాలీవుడ్ సినిమాలపై చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారడంతో పలువురు ఈయన వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.
మరోవైపు రిషబ్ శెట్టి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.