కోలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. నటి సనమ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు వైరల్!

సాధారణంగా ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే ఈ రకమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) ఇబ్బందులు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే.

 Sanam Shetty Sensational Comments Goes Viral In Social Media Details Inside , Ca-TeluguStop.com

ఇలా చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీమణులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయనే విషయాన్ని స్వయంగా వారే వెల్లడించిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఇలా టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉన్నాయని పలువురు ఆరోపణలు చేశారు .

Telugu Actresssanam, Kolkatta, Sanamshetty, Tollywood-Movie

తాజాగా నటి సనమ్ శెట్టి ( Actress Sanam Shetty )కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేశారు.ఇటీవల ఒక ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె ఈ విషయం గురించి మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఇతర పేరు పొందిన చిత్ర పరిశ్రమలో మాదిరిగానే మహిళలకు దర్శక నిర్మాతల నుంచి ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు.ఇటీవల కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ ( Kol Katta Trainee Dr )పై జరిగిన హత్యాచార ఘటనని నిరసిస్తూ ర్యాలీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాను.ఇదే విషయం గురించి పోలీసుల నుంచి పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

Telugu Actresssanam, Kolkatta, Sanamshetty, Tollywood-Movie

మహిళలు ప్రతి ఒక్కరంగంలోనూ ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అయితే వారు ఈ విషయాలన్నింటినీ బయట పెట్టలేకపోతున్నారని తెలిపారు.నేను కూడా ఇలాంటి ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నాను అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎందుకు వాటిని బయట పెట్టరని చాలా మంది నన్ను ప్రశ్నించారు.ఈ సంఘటనల గురించి పరిస్థితుల రీత్యా బయటకు చెప్పలేమని సనమ్ శెట్టి క్యాస్టింగ్ కౌఛ్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే తమిళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు బహిరంగంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

సనమ్ శెట్టి చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube