వీడియో: ఏందిది, పామును కొరికి చంపేసిన బుడ్డోడు.. ఆసుపత్రికి తీసుకెళ్లగా..?

సాధారణంగా పాములు( snakes ) అత్యంత విషపురితమైనవి.ఈ విష పురుగులు ఒక్కసారి కాటు వేస్తూ చాలు నేరుగా పైలోకానికి టికెట్ తీసుకునట్లే అవుతుంది.

 What Happened, The Kid Who Was Bitten By A Snake And Taken To The Hospital, Biha-TeluguStop.com

అందుకే పామును చూస్తేనే గుండె గుబేల్ మంటది.అది కనిపించగానే మనం చాలా దూరం పారిపోతాం.

కానీ ఒక ఏడాది వయసున్న బుడ్డోడు మాత్రం ఎవరూ ఊహించని ఒక షాకింగ్ పని చేశాడు.ఈ బాలుడు ఒక పామును కొరికి కొరికి దాన్ని చంపేశాడు.

కొద్దిసేపు పామును బబుల్ గమ్‌ లాగా నమిలాడు కూడా.అయినా అతడికేం కాలేదు.

ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ రాష్ట్రం( Bihar ), గయా జిల్లా, ఫతేహ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముహార్ గ్రామంలో జరిగింది.అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే రియాన్ష్ అనే ఒక అబ్బాయి తన ఇంటి పైకప్పు మీద ఆడుకుంటూ ఒక చిన్న పామును కనుగొన్నాడు.ఆ పామును ఒక బొమ్మ అనుకుని దాన్ని చేతిలో పట్టుకున్నాడు.

అంతేకాదు, ఆ పామును కొరికాడు.నోట్లో పెట్టుకొని గట్టిగా కోరుతూ ఉండటం వల్ల ఆ పాముకు బాగా గాయాలయ్యాయి చివరికి అది చనిపోయింది.

ఈ సంఘటన తెలిసి ఆ బాలుడు అమ్మ చాలా ఉలిక్కిపడింది.ఆమె వెంటనే పామును తన బిడ్డ నోటి నుంచి తీసి పక్కన పడేసింది.

రియాన్ష్‌కు ఏమైనా విషం ఎక్కిందేమో అని ఆ కుటుంబం చాలా భయపడింది.వెంటనే అతన్ని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.అక్కడి డాక్టర్లు రియాన్ష్‌ను పరీక్షించారు.పరీక్షల తర్వాత, రియాన్ష్‌కు ఎలాంటి హాని లేదని చెప్పారు.ఆ పాము విషం లేని సాధారణ పాము అని, వర్షాకాలంలో ఈ రకమైన పాములు ఎక్కువగా కనిపిస్తాయని డాక్టర్లు రియాన్ష్ తల్లిదండ్రులకు చెప్పారు.రియాన్ష్ బాగానే ఉన్నాడని డాక్టర్లు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విచిత్రమైన సంఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.బాలుడిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

కొంతమంది ఈ సంఘటనను నమ్మలేకపోతున్నారు.మరికొంతమంది ఈ సంఘటనను చూసి నవ్వుకుంటున్నారు.

ఈ బాలుడు ఇప్పుడే ఎలా ఉన్నాడంటే పెద్దయ్యాక ఇంకా ఎలా ఉంటాడో అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube