అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను( Kamala Harris ) అధికారికంగా ఖరారు చేసేందుకు చికాగోలో డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతోంది.
అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన సతీమణి మిచెల్ ఒబామా తదితర కీలకనేతలు ఆమెకు తమ మద్ధతు ప్రకటించారు.
మరోవైపు.
కమలా హారిస్‌కు ఇంటా బయటా మద్ధతు పెరుగుతుండటంతో ట్రంప్ ( Trump )శిబిరంలో కలవరం మొదలైంది.ఇప్పటికే ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేలు, విరాళాల సేకరణ విషయంలో కమల దూకుడుతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆమెపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు ట్రంప్ ఆయన బృందం.వీరిద్దరి మధ్య ముఖాముఖి చర్చ జరిగితే చూడాలని అమెరికన్లు ఆశిస్తున్నారు.
అయితే సెప్టెంబర్ 4న ప్రెసిడెన్షియల్ డిబేట్‌కు కమలా హారిస్ నో చెప్పడంతో , ఫాక్స్ న్యూస్ నిర్వహించే టెలి టౌన్‌హాల్‌కు హాజరవుతానని ట్రంప్ ప్రకటించారు.
సెప్టెంబర్ 4కు బదులు ఫాక్స్ న్యూస్ యాంకర్ సీన్ హన్నిటీ హోస్ట్ ( Hosted by Fox News anchor Sean Hannity )చేసే టెలీ టౌన్‌హాల్‌కు తాను అంగీకరిస్తున్నానని.ఇది గ్రేట్ కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియాలో జరుగుతుందని ట్రంప్.తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
ఫాక్స్ న్యూస్ చర్చలో పాల్గొనకూడదనే హారిస్ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదని.తనతో ముఖాముఖి తలపడటం ఆమెకు కష్టమని ట్రంప్ పేర్కొన్నారు.
హారిస్ ప్రచార బృందం ప్రకారం.కమలా హారిస్ రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్ ఒక వైస్ ప్రెసిడెంట్ డిబేట్‌లో పాల్గొంటారని, ఆమె రెండు ప్రెసిడెన్షియల్ డిబేట్‌లతో తలపడతారని తెలిపింది.
సెప్టెంబర్ 10న జరిగే మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌ను ఏబీసీ న్యూస్ హోస్ట్ చేయనుంది.అలాగే అక్టోబర్‌లో జరగనున్న రెండవ డిబేట్ డేట్ ఇంకా ప్రకటించలేదు.సెప్టెంబర్ 10న చర్చా కార్యక్రమం ముగిసిన తర్వాత మరోదాని గురించి ఆలోచిస్తామని హారిస్ ప్రచార బృందం స్పష్టం చేసింది.