తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఆయన అభిమానులు ఆ సినిమాల మీద విశేషమైన అంచనాలను పెట్టుకున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం.
ఇక ఈ సంవత్సరం కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన వచ్చే సంవత్సరం రాజా సాబ్, ఫౌజీ ( Raja Saab, Fauji )సినిమాలతో ప్రేక్షకులు అలరించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మారుతి( Maruti ) డైరెక్షన్ లో చేస్తున్న రాజసాబ్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుంది.మరి ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ప్రేక్షకులు పలు రకాల అనుమానాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే సినిమా మేకర్స్ కూడా తొందర్లోనే ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ట్రైలర్ మాత్రం చాలా పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించి కట్ చేయడానికి మారుతి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట.
ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మారుతి కెరియర్ అనేది మారిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఈ సినిమాతో మారుతి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…ఇక ఇంతకుముందు ఆయన ఎప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు.కాబట్టి ఈ సినిమాతో డైరెక్ట్ గా కొడితే కుంభస్థలాన్ని కొడతాడా లేదంటే మళ్లీ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కి పడిపోతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.