ఒకప్పుడు ఇండియన్ సినిమా ( Indian cinema )అంటే బాలీవుడ్ సినిమాలు అని మాత్రమే చెప్పేవారు.అంతలా బాలీవుడ్ సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించాయి.
ఇలాంటి తరుణంలో తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ వారికి చాలా చిన్న చూపు ఉండేది.ఈ క్రమంలోనే తెలుగు సినిమా సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చూపించారు.
డైరెక్టర్ ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas )నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయింది.
దీంతో బాలీవుడ్ హీరోలను సైతం ప్రభాస్ ను వెనక్కి నెట్టి ఇండియన్ స్టార్ హీరోగా మొదటి స్థానంలో నిలిచారు.దీంతో వీలు దొరికినప్పుడల్లా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రభాస్ పై అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై తమ అక్కసు వెళ్ళగకుతూ ఉంటారు.
తాజాగా బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సీ( Actor Harshad Warsi ) ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
కల్కి సినిమాలో ప్రభాస్ తనకు ఒక జోకర్ లా కనిపించారని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అమితాబ్ గారి క్యారెక్టర్ ముందు ప్రభాస్ నటన తేలిపోయిందని తెలిపారు.మ్యాడ్ మ్యాక్స్ తరహాలో ప్రభాస్ పాత్ర ఉంటుందని ఊహించాను అలా లేకపోవడం తనకు బాధ కలిగించిందని ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తనని విమర్శించేలాగే ఉన్నాయని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈయన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.
ఈ క్రమంలోనే నటుడు సుధీర్ బాబు( Actor Sudhir Babu ) సైతం అర్షద్ చేసిన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.ఒక సినిమాని నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్లేదు కానీ ఇలా ఒక పాత్ర గురించి తప్పుగా మాట్లాడటం సరైనది కాదని తెలిపారు.వార్సీ వృత్తి నైపుణ్యం లోపించడం వల్లే ఈయన ఇలా మాట్లాడుతున్నారని, ప్రస్తుతం ప్రభాస్ ఉన్న స్థాయిని మీరు ఎప్పటికీ అందుకోలేరని అలాంటి వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సరైనది కాదు అంటూ నటుడు సుధీర్ బాబు తనదైన శైలిలోనే వార్సీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.