రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ పోషకాల లోపం కావొచ్చు!

ఆరోగ్యమైన జీవితానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.

అందుకే కడుపునిండా తిండి.కంటి నిండా నిద్ర అంటారు.

ఈ రెండు సమపాళ్లలో ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది.అయితే ఇటీవల రోజుల్లో నిద్రలేమి( Insomnia ) కారణంగా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

ఒత్తిడి, ఆందోళన, స్క్రీన్ టైమ్ అధికంగా ఉండటం వంటి అంశాలే కాదు కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా కంటికి కునుకు కరువు అవుతుంది.

మంచి నిద్రకు మూడు పోషకాలు చాలా అవసరం.ఏ జాబితాలో పొటాషియం( Potassium ) గురించి మొదట చెప్పుకోవాలి.

ఇది నాడులను కండరాలను నియంత్రిస్తుంది.శరీరంలో పొటాషియం లెవెల్స్ తగ్గినప్పుడు నిద్ర పట్టడం లో ఇబ్బందులు తలెత్తుతాయి.

కాబట్టి నైట్ సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే అరటి, అవకాడో, ఆకుకూరలు, క్యారెట్, చిలగడదుంప వంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.

"""/" / అలాగే మెగ్నీషియం( Magnesium ) నిద్రను నియంత్రించే ప్రక్రియ లో కీలకపాత్రను పోషిస్తుంది.

మెగ్నీషియం లోపం వల్ల తలెత్తే సమస్యల్లో నిద్రలేమి ఒకటి.మెగ్నీషియం కోసం పాలకూర, బాదం గింజలు, కొబ్బరి పాలు, బ్రెజిల్ న‌ట్స్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వంటి ఆహారాల‌ను తీసుకోవచ్చు.

"""/" / ఇక విటమిన్ డి( Vitamin D ) లోపం కారణంగా కూడా రాత్రుళ్ళు నిద్ర పట్టదు.

శరీరానికి విటమిన్ డి అందనప్పుడు నిస్సత్తువ, పగటిపూట మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పగటిపూట నిద్ర పోతే రాత్రుళ్లు నిద్ర పట్టదు.పైగా విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు బలహీనంగా మారతాయి.

మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి విటమిన్ డి కోసం స‌న్‌రైజ్‌ కు ఎక్స్పోజ్ అవ్వండి.

విటమిన్ డి కోసం పుట్ట‌గొడుగులు, గుడ్లు, చేప‌లు, పాలు మ‌రియు పాల‌ ఉత్ప‌త్తులు తీసుకోండి.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్లే దేవర మూవీ హిట్టైందా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?