రేపు పుష్ప రిలీజ్ ఉంది అనగా కన్నడ ఆడియెన్స్ పుష్ప ని బాయ్ కాట్ చేయాలని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.బాయ్ కాట్ పుష్ప ఇన్ కర్ణాటక అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
ఇంతకీ వారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పుష్ప సినిమా కర్ణాటకలో భారీగా రిలీజ్ అవుతుంది.అయితే కన్నడ వర్షన్ కన్నా తెలుగు వర్షన్ ఎక్కువ స్క్రీన్స్‌లలో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
అందుకే కన్నడ ప్రేక్షకులు 2 గంటల సినిమా కోసం తమ మాతృ భాషని అవమాన పరచమని చెబుతున్నారు.
అంతేకాదు కె.జి.ఎఫ్ కన్నడలో, యంథిరన్ తమిళంలో, బెంగళూరు డేస్ మళయాళంలో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించే వారా అంటూ అక్కడ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.పుష్ప సినిమా ముందు ఇలా కర్ణాటక ప్రేక్షకులు రివర్స్ అవడం చిత్రయూనిట్ కు షాక్ ఇస్తుంది.కర్ణాటకలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగ ఉంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తుండగా.
బెంగళూరులో ఎక్కువగా తెలుగు వర్షన్ రిలీజ్ చేయడం పై రచ్చ చేస్తున్నారు.ఓ పక్క సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్న పుష్ప టీం కి ఇదో పెద్ద షాక్ అని చెప్పొచ్చు.