సాధారణంగా 90 ఏళ్ల వయసు దాటితే ఎవరైనా సరే మంచాన పడతారు.ఒకవేళ తిరగ గలిగే స్టామినా ఉన్నా చిన్న పనులే చేయగలరు.
అది కూడా కష్టంగానే చేస్తారు.ఇక ఎక్సర్‌సైజుల వంటి వాటి జోలికి వాళ్లు అసలు వెళ్లరు.
ఆ వయసులో చేసే శరీర సామర్థ్యం గానీ సాహసించే ధైర్యంగా గానీ ఉండదు.కానీ జర్మనీకి చెందిన జోహన్నా క్వాస్( Johanna Quas from Germany ) ఈ భావన తప్పు అని నిరూపిస్తోంది.
ఈమె ఒక జిమ్నాస్ట్.( Gymnast ) అయితే 98 ఏళ్ల వయస్సులో కూడా, తన అద్భుతమైన జిమ్నాస్టిక్స్ స్కిల్స్‌తో ప్రపంచాన్ని మెప్పిస్తూనే ఉంది.10 ఏళ్ల చిన్న వయస్సులోనే జిమ్నాస్టిక్స్ ప్రారంభించిన జోహన్నా, ఈ క్రీడ పట్ల తనకున్న అంకితభావాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.ప్రొఫెషనల్ పోటీల నుంచి రిటైర్ అయినప్పటికీ జిమ్నాస్టిక్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
86 ఏళ్ల వయస్సులో, జోహన్నాను వరల్డ్స్ ఓల్డెస్ట్ జిమ్నాస్ట్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించింది, 2012లో ఆమె ఈ మైలురాయిని సాధించింది.ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో, ఫ్లోర్ & బీమ్‌పై తన నైపుణ్యాలను ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.అంత పెద్ద వయస్సులోనూ ఇంత అద్భుతంగా ప్రదర్శన ఇవ్వగల జోహన్నా చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.వీరిలో మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ( Mahindra Group Chairman Anand Mahindra )కూడా ఒకరు.
జోహన్నా ప్రదర్శన వీడియోను ఆయన తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ వీడియో వైరల్‌గా మారింది.
జోహన్నాలో చురుకుదనం, శక్తి చాలా మంది యువకుల కంటే ఎక్కువగా ఉండటం వల్ల నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.ఆమె కథ స్ఫూర్తినిచ్చింది.ఆనంద్ మహీంద్రా వీడియోకు 100,000కు పైగా వ్యూస్ వచ్చాయి.వేలాది మంది లైక్ చేశారు.వీడియోపై ప్రజల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.వయస్సు ఒకరి సామర్థ్యాలను పరిమితం చేయదని నమ్మారు.
వయస్సు పై బడినా, జోహన్నా రోజూ ఒక గంట పాటు ట్రైనింగ్ తీసుకుంటుంది.పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండే డైట్ ఫాలో అవుతుంది.
సాధన శక్తిని ఆమె నమ్ముతుంది.దశాబ్దాలుగా చేస్తున్న నిరంతర ప్రయత్నాల వల్లే తాను ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నానని ఆమె చెబుతుంది.
చురుకుగా ఉండటం జీవితానికి చాలా ముఖ్యమైనదని జోహన్నా నమ్ముతూ జిమ్నాస్టిక్స్ పై తన అభిరుచిని చాటుకుంటుంది.తాను జిమ్నాస్టిక్స్ చేయడం మానేసిన రోజే తన జీవితం ముగుస్తుందని ఆమె తరచుగా అంటుంది.