మమ్ముట్టి టర్బో ట్రైలర్ మీద నెగిటివ్ ప్రచారం చేస్తుంది ఎవరు..?

వైవిధ్యమైన సినిమాలను చేయడంలో మలయాళం సినిమా ఇండస్ట్రీ నటులు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.ఇక అందులో మమ్ముట్టి( Mammootty ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Who Is Doing Negative Publicity On Mammootty Turbo Trailer Details, Negative Pu-TeluguStop.com

ఆయన ఎప్పుడూ వైవిద్యమైన కథంశాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తుంటారు.ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘కన్నూర్ స్క్వాడ్’, ‘భ్రమ యుగం ‘ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఇప్పుడు ‘టర్బో’( Turbo ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయింది.ఇక ఇది చూస్తుంటే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది.అయితే ఈ సినిమా మీద బాలీవుడ్( Bollywood ) వాళ్లు కొంతవరకు నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 Who Is Doing Negative Publicity On Mammootty Turbo Trailer Details, Negative Pu-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా లో( Pan India ) రిలీజ్ అవ్వడం లేదు.కానీ మలయాళం లో మాత్రమే రిలీజ్ అవుతుంది.అయినప్పటికీ ఆ ట్రైలర్ ను చూసినవాళ్లు మమ్ముట్టి ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం అవసరమా అన్నట్టుగా అతని మీద విమర్శలు గుప్పిస్తున్నారట.

నిజానికి మమ్ముట్టి యాక్షన్ సినిమాలనే కాదు ఏ జానర్లో అయినా సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాడు.ప్రతి జానర్ లో కూడా ఆయన ఒక సక్సెస్ ని సాధించడం లో ఆయన ఎలాంటి డెడికేషన్ పెడతారో మనం అర్థం చేసుకోవచ్చు.ఒక సినిమాకి మరొక సినిమాకి మధ్య జానర్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

టర్బో సినిమాను సక్సెస్ చేసి ఆయనను విమర్శించే వాళ్ళకి చెక్ పెడతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube