విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు..!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో శనివారం నుండి సోమవారం వరకు రవాణా రాకపోకలు ఎక్కువయ్యాయి.ఎవరికివారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి సొంత ఊర్లకు వస్తున్నారు.

 Heavy Stalled Vehicles On Vijayawada Hyderabad National Highway Details, Ap Ele-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది.దీంతో ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

పల్నాడు ప్రాంతంలో కొన్ని చెదురు ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి.నరసరావుపేటలో వైసీపీ.

( YCP ) టీడీపీ( TDP ) పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై( Vijayawada Hyderabad National Highway ) భారీగా రద్దీ నెలకొంది.ఓటు వేసేందుకు హైదరాబాదు నుంచి ఏపీకి వెళ్లిన వారంతా తిరుగుపయానమయ్యారు.దీంతో చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా( Panthangi Toll Plaza ) వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఏపీతోపాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో.హైదరాబాద్ వస్తున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు ఈసారి చైతన్యవంతంగా పోలింగ్ లో పాల్గొన్నారు.సాయంత్రం అయినా గాని క్యూ లైన్ లో చాలామంది జనాలు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల కంటే ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కానున్నది అని అంటున్నారు.ప్రధానంగా రూరల్ ప్రాంతాలలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

జూన్ 4వ తారీఖు ఫలితాలు వెలువడనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube