తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక మూడోవ సినిమా అయిన వర్షం సినిమాతో కమర్షియల్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న కల్కి సినిమా( Kalki Movie ) రిలీజ్ కి రెడీ అయింది.అయితే జూన్ 27వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది.నిజానికైతే మే 9వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రావాలి.కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది.దాంతో జూన్ 27వ తేదీన పక్కాగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అందుకోసమే వాళ్ళు అనుక్షణం తీవ్రమైన కసరత్తులు చేస్తూ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
అయితే సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా నిదానంగా సాగుతున్నడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ సినిమా దర్శకుడు నాగశ్విన్( Director Nag Ashwin ) ఒక సందర్భంలో తన ఇబ్బందులను తెలియజేశాడు…ఇక మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియాలో( Pan India ) ఏ రికార్డు కూడా మిగులు ఉండదు అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అంటూ సినిమా మేకర్స్ అయితే మంచి నమ్మకంతో ఉన్నారు.మరి వాళ్ళ నమ్మకాన్ని నిలబడుతూ ఈ సినిమా భారీ సక్సెస్ సాధించే దిశగా ముందుకు సాగుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత తర్వాత వెయిట్ చేయాల్సిందే…
.