నిన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల( Assembly, Parliament Elections ) పోలింగ్ సరళి ఎవరికి అంతుపట్టని విధంగా ఉంది.ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపారు అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.
దీనికి కారణం గతం కంటే భిన్నంగా జనాలు ఆలోచించడమే.తమకు ఎవరి పరిపాలన కావాలో జనాలు ముందుగానే ఫిక్స్ అయిపోయారు.
అందుకే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది పట్టించుకోకుండా, రాష్ట్రస్థాయిలో తాము ఎవరి నాయకత్వం కోరుకుంటున్నామో ముందుగానే ఫిక్స్ అయ్యి, ఆ పార్టీ గుర్తుకే బటన్ నొక్కి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.గతంలో ఎప్పుడు లేనంతగా ఏపీలో ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది .మహిళలు, వృద్ధులు ,యువకులు ఇలా అందరూ భారీ క్యూ లైన్ లలో నుంచుని మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది అనేది ముందుగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
గతంలో ఓటర్ల అభిప్రాయాలు వేరేలా ఉండేవి.
స్థానిక సమస్యలు, సామాజిక వర్గం, అభ్యర్థుల గుణగణాలు ఇవన్నీ ఆలోచించి ఓటు వేసేవార అయితే ఇప్పుడు మాత్రం జగన్, చంద్రబాబు( Jagan, Chandrababu ) వీరిద్దరి పరిపాలన ను బేరీజు వేసుకుని ఓటు వేసినట్లుగా అర్థం అవుతుంది.ఓటు వేసిన వారిని ఎవరిని అడిగినా, పార్టీ గుర్తు చెబుతున్నారు తప్ప అభ్యర్థిని చూసి ఓటు వేశామని చెప్పే పరిస్థితి కనిపించలేదు.రూరల్ అర్బన్ లలో గుర్తులు ఆధారంగానే ఓటర్లు ఈవీఎం మిషన్ బటన్ నొక్కారు.
పలానా పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ఎవరు పట్టించుకోలేనట్టుగా కనిపిస్తున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఎంత మేలు జరుగుతుంది, ఎన్ని ప్రయోజనాలు చేకూరుతాయి అనే వాటినే లెక్కలు వేసుకుని.
జగన్ రావాల చంద్రబాబు పాలన కావాలా అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఓట్లు వేస్తున్నట్లుగా అర్థమవుతుందిn గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి కనిపించలేదు.దూర ప్రాంతాల నుంచి సైతం ఏపీలోని తమ సొంత ఊళ్లకు వచ్చి ఓట్లు వేయడం కనిపించింది.ఓటింగ్ జరిగిన విధానం చూస్తే కూటమి అధికారంలోకి వస్తుందా.
వైసిపికి మళ్లీ పట్టం కడతారా అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.ఎగ్జిట్ పోల్స్ పై ప్రస్తుతం నిషేధం కొనసాగుతూ ఉండడంతో, ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి అనేదానిపైనే అందరికీ ఆసక్తి పెరిగింది .వీటి పైనా, అభ్యర్థుల మెజారిటీ పైన ఏపీలో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి.