డైరెక్టర్ అన్నాక తనకంటూ ఒక సొంత క్రియేటివిటీ ఉంటుంది తన ఆలోచన ధోరణిని బట్టే సినిమా కూడా రూపొందుతుంది అది ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చితే అంత పెద్ద విజయం సాధిస్తుంది అలా ప్రతి డైరెక్టర్ కి కొన్ని అలవాట్లు కొన్ని నియమాలు సెంటిమెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మరి టాలీవుడ్ లో కొంతమంది దర్శకులను తీసుకుంటే వారు ప్రతి సినిమాకి ఒకే రకమైన ఫార్మాట్ ని ఉపయోగిస్తున్నారు ఇంతకీ మన దర్శకులు అలవాట్లు ఏంటి? అవి మనం ప్రతి సినిమాలో ఎలా చూస్తున్నాము అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక మన తెలుగు దర్శకుల విషయానికొస్తే కొరటాల శివ( Koratala Siva ) గురించి మాట్లాడుకోవాలి.ఆయన సినిమాలో హీరోలంతా కూడా ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే కచ్చితంగా టక్ చేస్తుంటారు.చూడ్డానికి ఎంతో ప్రొఫెషనల్ గా కనిపిస్తారు.
ఇక లోకేష్ కనగరాజ్( Lokesh Kanagaraj ) విషయానికొస్తే తన ప్రతి సినిమాలోను అర్ధరాత్రి ఫైట్ సీన్ ఉండి తీరాల్సిందే.హీరో ఎవరైనా సరే ఫార్మాట్ మాత్రం మారదు.
ఇక తమిళ్ లోనే మరో డైరెక్టర్ అయిన అట్లీ కుమార్( Atlee Kumar ) కూడా ఇంచుమించు విచిత్రమైన స్వభావాన్ని కలిగిన సినిమాలను తీస్తూ ఉంటాడు.అదేంటంటే ఆయన సినిమాలో నటించే ఏదో ఒక మెయిన్ లీడ్ ఖచ్చితంగా చనిపోతుంది.
ఎక్కువగా హీరోయిన్స్ ని చంపేయడం ఈయనకు అలవాటు.శేఖర్ కమ్ముల( Shekar Kammula ) లాంటి డైరెక్టర్ కి ఎలాంటి సీజన్ అయినా పర్వాలేదు వర్షం ఖచ్చితంగా ఉండాలి.

ఇక టాలీవుడ్ జక్కన్న( Jakkanna ) విషయానికొస్తే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది.అది కూడా లేడీ సెంటిమెంట్ తో ఉండడం విశేషం.దాన్నుంచి ఎమోషనల్ గా కథను క్యారీ చేస్తూ ఉంటాడు.బోయపాటి( Boyapati ) విషయానికొస్తే సినిమాలో ఎవరికో ఒకరికి పిండం పెట్టకుండా ఊరుకోడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ( Trivikram ) విషయానికి వస్తె ఆయన సినిమాలో ఖచ్చితంగా రెండవ హీరోయిన్ ఉంటుంది.ఆమె మొదటి హీరోయిన్ కన్నా పవర్ ఫుల్ గా ఉండి ఉంటుంది.
తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు అయితే హీరోకి ఏదో ఒకరకంగా ఒక భయంతో కూడిన సీన్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.ఇక హీరో నిజానికి ఈ కీరా అడ్రస్ గా ఉంటుంది పూరి డైరెక్షన్.
ప్రశాంత్ నీల్ అయితే సినిమా మొత్తం దుమ్ము, ధూళి తో నింపేస్తాడు.ఇక సోషల్ మెసేజ్ లేకుండా శంకర్ సినిమా తీయనే తీయడు.







