సినిమా ఇండస్ట్రీకి ఒక్కసారి వచ్చాక ఆ రుచి ఏంటో అర్థం అయ్యాక దానిని వదిలిపెట్టడం కష్టం. స్టార్ హీరోగా లేదా స్టార్ సెలబ్రిటీగా ఒక్కసారి స్టార్ డం అనుభవించిన తర్వాత మళ్ళీ సాదాసీదా జీవితానికి వెళ్లాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు.
మరి అలా ఒక్కసారి సినిమా జీవితం చూసిన తర్వాత చాలామందికి అనుకోని కారణాలవల్ల గ్యాప్ రావచ్చు కానీ ఎటోచ్చి సినిమా ఇండస్ట్రీకే రావాలని మళ్లీ వారు తహతలాడుతూ ఉంటారు అలా ఒకసారి సినిమా ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ లో ఉండి చాలా ఏళ్లపాటు గ్యాప్ వచ్చి తిరిగి రీఎంట్రీ కూడా ఇచ్చిన వాళ్లు కొంతమంది ఉన్నారు.అయినా కూడా రీఎంట్రీలో సక్సెస్ దొరకక ఇప్పటికీ ఒక ఛాన్స్ దొరక్కపోతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఆ సెలబ్రెటీలు ఎవరు ? వారు రీఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రేణు దేశాయి( Renu Desai ) తన భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ సినిమాలో చివరిసారిగా కలిసి నటించింది.ఆ తర్వాత దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తీసుకుంది.పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగానే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.
స్వతహాగా చేయాలని ఇష్టం ఉన్న ఎందుకో ఆమె సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకుంది.కానీ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా దారుణ పరాజయం పాలవడంతో ఆమెకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు.
ఇక కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్న తొట్టెంపుడి వేణు( Thottempudi Venu ) సైతం సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ మధ్య పలు కారణాల వల్ల నిష్క్రమించారు.కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చినా కూడా ఇలాంటి ఉపయోగం లేకపోయింది.
ఆ తర్వాత పదేళ్లు గ్యాప్ తీసుకుని రామారావు ఆన్ డ్యూటీ( Ramarao On Duty ) అనే మరో సినిమాతో ప్రయత్నించిన అది కూడా సక్సెస్ అవలేదు.ఏదో అడపాదడపా ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఇక జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సదా( Sadha ) సైతం దాదాపు 7, 8 ఏళ్ల గ్యాప్ తీసుకొని అహింస( Ahimsa ) అనే సినిమాతో మరోమారు రీయంట్రీ ఇచ్చిన ఆ సినిమా ఎప్పుడు విడుదల అయిందో కూడా ఎవరికి తెలియలేదు.ఇక ఈ లిస్టులో ఇలియానాని( Ileana ) కూడా చేర్చాల్సిందే.ఎందుకంటే 2012లో ఇలియానా దేవుడు చేసిన మనుషులు సినిమాలో రవితేజ సరసన నటించగా, దాదాపు ఆరేళ్ల విరామం తీసుకుని మళ్లీ అమర్ అక్బర్ ఆంటోనీ( Amar Akbar Antony ) అనే సినిమాలో కనిపించింది.ఈ సినిమా కూడా పరాజయం పాలవడంతో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది.







