వారణాసి కి పవన్ చంద్రబాబు .. కారణం ఏంటంటే ?

నిన్ననే ఏపీలో ఎన్నికల పోలింగ్( Election polling in AP ) ముగిసింది ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఆ కూటమిలోని పార్టీలలో ఉండడంతో,  మంచి ఉత్సాహం మీద ఉన్నారు.ఇక ఎన్ డి ఏ లో బిజెపి కూడా భాగస్వామ్యంగా ఉంది.

 What Is The Reason Of Pawan Chandrababu For Varanasi , Ap Government, Jagan, Ysr-TeluguStop.com

  ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండడంతో , అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అశక్తిగానే ఉన్నారు .ఇక వీరితో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బిజెపి( Bjp ) కూడా ఆసక్తిగానే ఉంది .ఇది ఇలా ఉంటే .  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ),  టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )వారణాసికి వెళ్లారు.ఈరోజు ప్రధాని నరేంద్ర మోది వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో 12 బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు .

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Modhi, Pavan Kalyan, Ysrcp-Politics

అలాగే ఏపీ నుంచి చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ లకు కూడా ఆహ్వానం అందింది.దీంతో వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారణాసికి వెళ్లారు.ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా నామినేషన్ దాఖలు కు ముందు కాశీ విశ్వనాథుడు,  కాలభైరవ ఆలయాలను ( Kashi Vishwanatha, Kalabhairava temples )ఆయన దర్శించుకోనున్నారు.  బనారస్ హిందూ వర్సిటీ నుంచి.

  కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మార్గంలో నాలుగు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోది రోడ్ షో నిర్వహిస్తారు .

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Modhi, Pavan Kalyan, Ysrcp-Politics

 అలాగే ఈరోజు ఎన్డీఏ నేతలతోనూ ప్రధాని సమావేశం అవుతారు.వారణాసి ఎంపి స్థానం బిజెపికి , మోది కి కంచుకోట గా  మారింది.ఇప్పటికే ఇక్కడి నుంచి రెండుసార్లు మోదీ సాధించారు.2019 లోక్ సభ ఎన్నికల్లో 6,74,664 ఓట్లతో గెలిచి 63.6 శాతం ఓట్లను సాధించారు .2014లో మోది గుజరాత్ లోని వడోధర , ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube