వారణాసి కి పవన్ చంద్రబాబు .. కారణం ఏంటంటే ?
TeluguStop.com
నిన్ననే ఏపీలో ఎన్నికల పోలింగ్( Election Polling In AP ) ముగిసింది ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఆ కూటమిలోని పార్టీలలో ఉండడంతో, మంచి ఉత్సాహం మీద ఉన్నారు.
ఇక ఎన్ డి ఏ లో బిజెపి కూడా భాగస్వామ్యంగా ఉంది. ఇంకా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండడంతో , అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అశక్తిగానే ఉన్నారు .
ఇక వీరితో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బిజెపి( Bjp ) కూడా ఆసక్తిగానే ఉంది .
ఇది ఇలా ఉంటే . జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )వారణాసికి వెళ్లారు.
ఈరోజు ప్రధాని నరేంద్ర మోది వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 12 బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు .
"""/" /
అలాగే ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా ఆహ్వానం అందింది.
దీంతో వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారణాసికి వెళ్లారు.ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా నామినేషన్ దాఖలు కు ముందు కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాలను ( Kashi Vishwanatha, Kalabhairava Temples )ఆయన దర్శించుకోనున్నారు.
బనారస్ హిందూ వర్సిటీ నుంచి. కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు ఐదు కిలోమీటర్ల మార్గంలో నాలుగు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోది రోడ్ షో నిర్వహిస్తారు .
"""/" /
అలాగే ఈరోజు ఎన్డీఏ నేతలతోనూ ప్రధాని సమావేశం అవుతారు.వారణాసి ఎంపి స్థానం బిజెపికి , మోది కి కంచుకోట గా మారింది.
ఇప్పటికే ఇక్కడి నుంచి రెండుసార్లు మోదీ సాధించారు.2019 లోక్ సభ ఎన్నికల్లో 6,74,664 ఓట్లతో గెలిచి 63.
6 శాతం ఓట్లను సాధించారు .2014లో మోది గుజరాత్ లోని వడోధర , ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లో రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించారు.
డాకు మహారాజ్ సినిమాపై ప్రశంసలు కురిపించిన బన్నీ…. నాగ వంశీ పోస్ట్ వైరల్!