కొంతమందికి డబ్బంటే అస్సలు లెక్క ఉండదు.ప్రియమైన వారి కోసం ఎంత మనీ అయినా మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తుంటారు.
కానీ కొందరు మాత్రం సొంత వాళ్ల ఖర్చును లెక్కపెట్టేస్తూ పిసినారితనం చేస్తారు.కొందరైతే ఫ్యామిలీ మెంబర్స్ కోసం పెట్టిన ప్రతీ రూపాయి వసూలు చేస్తారు.
కోట్లు ఉన్నా ఈ చిన్న బుద్ధులు మాత్రం మానరు.ఇటీవల వీరందరి కంటే డబ్బు పిచ్చి ఉన్న ఒక ధనవంతుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.
ఈ రిచ్ హస్బెండ్( Rich Husband ) తన భార్యను భార్యలా కాకుండా రెంట్ ఉంటున్న వ్యక్తిగా చూస్తున్నాడు.18 ఏళ్లుగా వివాహితులుగా, 6 ఏళ్లుగా న్యాయంగా వివాహబంధంలో ఉన్నప్పటికీ, ఆమె తన భర్తకు అద్దె చెల్లిస్తూనే ఉంది.ఈ రెంట్ గురించి ఆమె తాజాగా ఆన్‌లైన్‌లో తన నిరాశను వ్యక్తం చేసింది.ఈమె భర్త ఇప్పుడు రిటైర్ అయ్యాడట.ఆ టైమ్‌కే బాగా డబ్బు సంపాదించినా భార్యకు మాత్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయట్లేదట.ఇంట్లో ఉంటున్న వైఫ్ నుంచి అద్దె వసూలు చేస్తూనే ఉన్నాడట.
పిల్లలు లేని ఈ దంపతులలో భర్త రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, భార్య మాత్రం జీవనోపాధి కోసం పని చేయవలసి వస్తోంది.
పాండమిక్ సమయంలో, ఇంటి నుంచే పనిచేస్తూ, భర్త ఎలా గడుపుతున్నాడో చూసిన ఆమె మరింత నిరాశ చెందింది.ఆలస్యంగా లేచి, గోల్ఫ్ ఆడుతూ, భోజనం తింటూ, టీవీ చూస్తూ, తరచుగా స్నేహితులతో వారాంతపు ప్రణాళికలు వేసుకుంటూ భర్త తన సమయాన్ని గడుపుతున్నాడని ఆమె గమనించింది.ఈ ప్రవర్తన ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది, భర్త భార్య కంటే భూస్వామిలా ప్రవర్తిస్తున్నాడని చాలా మంది వ్యాఖ్యానించారు.
ఆ డబ్బు అతనేం చేసుకుంటున్నాడు? ఉన్న మనీతో శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేయవచ్చు కదా అని నెటిజన్లు భర్తకు చివాట్లు పెడుతున్నారు