ఏలూరు జిల్లాలోని( Eluru District ) పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.పెంటపాడు మండలం అలంపురం పోలింగ్ కేంద్రం వద్ద డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( Deputy CM Kottu Satyanarayana ) కుమారుడు కొట్టు విశాల్ పై( Kottu Vishal ) దాడికి యత్నించారు.
అదేవిధంగా కొట్టు సత్యనారాయణపై కొందరు జనసేన నేతలు( Janasena Leaders ) కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న విశాల్ పై జనసేన క్యాడర్ దాడికి ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే వైసీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు కొక్కిరిపాడులోనూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది.ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.