ఏజ్ పెరిగే కొద్ది తలెత్తే సమస్యల్లో మోకాళ్ళ నొప్పులు( knee pain ) ముందు వరుసలో ఉంటాయి.అయితే ఇటీవల రోజుల్లో ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు.
మోకాళ్ళ నొప్పుల కారణంగా ఏ పని చేయలేకపోతున్నారు.కాసేపు నడవాలన్న, నిలబడాలన్న, మెట్లు ఎక్కాలన్న ఎంతో బాధాకరంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.అయితే కొన్ని పానీయాలు మోకాళ్ళ నొప్పులను వదిలించడానికి చాలా అద్భుతంగా సహాయపడతాయి.
ఈ జాబితాలో పైనాపిల్ జ్యూస్( Pineapple Juice ) ఒకటి.పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం ఉన్నందున కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.బ్రోమెలైన్ అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారికి సహజమైన నొప్పి నివారిణిగా సహాయపడుతుంది.ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న వాపును కూడా తగ్గిస్తుంది.కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు పైనాపిల్ జ్యూస్ తీసుకోండి.
అలాగే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ ఒక కప్పు గ్రీన్ టీ( Green tea ) తీసుకోండి.గ్రీన్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.ఇవి మోకాళ్ళ నొప్పులను దూరం చేయడంలో అద్భుతంగా తోడ్పడతాయి.
అదే సమయంలో వెయిట్ లాస్ కు, ఆరోగ్యమైన గుండె పని తీరుకు కూడా గ్రీన్ టీ మద్దతు ఇస్తుంది.మోకాళ్ళ నొప్పులతో సతమతం అవుతున్నవారు రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు రుచికి సరిపడా తేనె కలుపుకుని తీసుకోండి.
ఈ పానీయం కూడా మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.ఇక వారానికి ఒక్కసారైనా చికెన్ సూప్ లేదా మటన్ పాయ సూప్ తీసుకోండి.వీటిలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.
ఎముకల్లో సాంద్రతను పెంచుతాయి.మోకాళ్ళ నొప్పులను సహజంగానే నివారిస్తాయి.