60 ఏళ్ల వయస్సులో డేటింగ్.. ఆ వార్తల గురించి అమీర్ ఖాన్ రియాక్షన్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్.

 Aamir Khan Confirms Releation His Friend Gauri Spratt Details, Bollywood, Aamir-TeluguStop.com

కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలలో కూడా చాలా సార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా తన భార్య విడాకుల విషయంలో అమీర్ ఖాన్ పేరు చాలా సార్లు మారు మోగింది.

తన మాజీ భార్యతో విడిపోయినప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు అమీర్ ఖాన్.ఆ విషయం పక్కన పెడితే తాజాగా అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Aamir Khan, Aamirkhan, Bollywood, Gauri Spratt-Movie

ప్రస్తుతం తాను రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడించారు.తన స్నేహితులతో డేటింగ్ లో( Dating ) ఉన్నాను అంటూ వస్తున్న వార్తలు నిజమే అని, ఇందులో వాస్తవం ఉంది అని ఆయన వెల్లడించారు.ముంబైలో నిర్వహించిన తన పుట్టినరోజు వేడుకల ముందు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ తో( Gauri Spratt ) ఏడాదిగా డేటింగ్‌ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.

తాను దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుసని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు.గౌరీ స్ప్రాట్‌ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నట్లు అమిర్ ఖాన్ వెల్లడించారు.అంతేకాకుండా తన ప్రొడక్షన్ బ్యానర్‌ లో పనిచేస్తుంది అని తెలిపారు.

Telugu Aamir Khan, Aamirkhan, Bollywood, Gauri Spratt-Movie

ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నారని వివరించారు.ఆమె తన కుటుంబ సభ్యులను కూడా కలిసిందని, మా రిలేషన్‌ గురించి వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు.ఆమెతో రిలేషన్‌ లో తాను నిబద్ధతతో, సంతోషంగా ఉన్నానని అమీర్ ఖాన్ తెలిపారు.

లగాన్, దంగల్ వంటి కొన్ని చిత్రాలను మాత్రమే గౌరీ స్ప్రాట్ చూశారని అన్నారు.తనకు సూపర్ స్టార్ అనే లేబుల్‌ ను ఉండడాన్ని తాను నమ్మడం లేదని ఈ సందర్భంగా అమీర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube