టాలీవుడ్ లో చిరంజీవి, మోహన్ బాబు అప్పుడప్పుడే ఎదుగుతున్నారు.మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వర్ రావు సినిమాలు తగ్గిస్తున్న రోజులు.అప్పుడే ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడు.
మంచి కథ ఉంటేనే సినిమా చేయాలి.లేదంటే ఖాళీగానే ఇంట్లో ఉండాలని భావించాడు.
అదే సమయంలో తనకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది.
ఆయన ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్న సమయంలో శ్రీరంగనీతులు అనే కథ తన దగ్గరికి వచ్చింది.
చాలా రోజుల తర్వాత ఆయనకు ఓ మంచి కథ దొరికింది.అందుకే తనే ఈ సినిమాను నిర్మించాలి అనుకున్నాడు.అదే సమయంలో కోదండరామిరెడ్డిని రమ్మని చెప్పాడు.నాలుగు రోజుల తర్వాత ఆయన అక్కినేని దగ్గరికి వచ్చాడు.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరయితే బాగుంటుంది అని అక్కనేని అడిగాడు.జయసుధ బాగుంటుందా? అని ఆయనే మళ్లీ అన్నాడు.కోదండరామిరెడ్డి ఏం మాట్లాడలేదు.ఈ సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వాడు.ఆయన చెప్పినట్లు నడవాలి.నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పాడు.
కొద్ది రోజుల తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ మొదలైంది.వారం రోజల పాటు చిత్రీకరణ కొనసాగింది.ఆ తర్వాత శ్రీదేవి దరన్శకుడి దగ్గరికి వచ్చి.ఓ సినిమా కొసం ముంబై వెళ్లాలి.
తన సీన్లు త్వరగా తీయాలని కోరింది.

విషయం అక్కినేనికి తెలిసింది.అంటే నేను రోజు నాలుగు గంటలకే లేవాలి.సరే అన్నాడు.
ఈ విషయం సత్యనారాయణకు కూడా చెప్పాడు.ఆయన కూడా ఇబ్బంది అయినా ఓకే చెప్పాడు.
తర్వాత రోజు సెట్ లో ఆరు గంటలకే శ్రీదేవి, అక్కినేని ఉన్నారు.సత్యానారాయణ రాలేదు.
ఎనిమిది అయినా ఇంకా రాలేదు.అప్పటికే శ్రీదేవితో పాటు అక్కినేనికి ఎంతో కోపం వస్తుంది.
సత్యనారాయణ 9 గంటలకు వచ్చాడు.సత్యనారాయణపై ఒంటికాలుపై లేచాడు ఏఎన్నారు.
సత్యనారాయణ.ఆరు గంటలకు రమ్మంటే 9 గంటలకు వస్తావా? నీకు బుద్ది ఉందా? అంటూ మండిపడ్డాడు.కాసేపయ్యాక వాతావరణం చల్లబడింది.త్వరత్వరగా షూటింగ్ కానిచ్చేశారు.