1.హెచ్ సి యు ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెన్షన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి రంజన్ ను అత్యాచార ఆరోపణల పై రిజిస్టార్ బిజె రావు సస్పెండ్ చేశారు.
2.కామారెడ్డిలో మెడికల్ కాలేజి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
3.రామేశ్వరానికి ఉగ్రవాద బెదిరింపు
రామేశ్వరం రామనంద స్వామి ఆలయానికి ఉగ్రవాద బెదిరింపులు రావడంతో పోలీసులు భారీగా భద్రతను పెంచారు.
4.ఆసుపత్రిలో చేరిన మాజీ ముఖ్యమంత్రి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య చిన్నపాటి శాస్త్ర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.
5.అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న ఈడీ సోదాలు
అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఇంకా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.విదేశీ నిధులను సొంత ఖాతాలకు మళ్ళించారన్న ఆరోపణల నేపథ్యంలో 40 మంది ఈడి అధికారులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.
6.హైవేల పై పెట్రోలింగ్ పెంచాలి : వీర్రాజు
జాతీయ రహదారులపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు .వెంటనే హైవేలపై పెట్రోలింగ్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
7.లోకేష్ శుభాకాంక్షలు
ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
8.ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగం నిషేధం
ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం విధించాలని హిందూ దేవదాయ శాఖకు మధురై హైకోర్టు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
9.హుక్క బార్ లపై నిషేధం
కోల్ కతాలో హుక్కా బార్ల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.కోల్ కతా నగరంలో హుక్క బార్లను నిషేధించింది.
10.ఆస్ట్రేలియాలో ఘనంగా నోముల ద్వితీయ వర్ధంతి
టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ద్వితీయ వర్ధంతి ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాల్లో నోముల అభిమానులు టిఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో వర్ధంతిని నిర్వహించారు.
11.ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేరువేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
12.ప్రాంతీయ భాషల్లో న్యాయ కోర్సులు
ప్రాంతీయ భాషల్లో న్యాయ కోర్సులు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
13.ప్రత్యేక విధానంతో ఐఆర్ఎంఎస్ పరీక్షలు
ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వేస్ నియామక పరీక్షను 2023 నుంచి ప్రత్యేకంగా రూపొందించిన విధానంతో నిర్వహించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
14.ఎన్డిటీవీకి రవీస్ రాజీనామా
ఎన్డిటీవీ డైరెక్టర్ ల పదవులకు ప్రణయ్ రాయ్ రాజీనామా చేసిన మరుసటి రోజు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పదవికి సీనియర్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత రవిశ్ కుమార్ కూడా రాజీనామా చేశారు.
15.మహారాష్ట్ర మంత్రులపై నిషేధం
బెలగావికీ మహారాష్ట్ర మంత్రులు రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే తేల్చి చెప్పారు.
16.నేను పాదయాత్ర చేస్తా : కేఏ పాల్
త్వరలోనే తాను పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
17.రాయలసీమ గర్జన
అభివృద్ధి వికేంద్రీకరణ ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది.
18.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేటికీ ఆరవ రోజుకు చేరుకుంది.
19.ములుగు జిల్లా ఏజేన్సీ లో హై అలర్ట్
ములుగు జిల్లా ఏజేన్సీ లో హై అలర్ట్ కొనసాగుతుంది.మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది.ఇప్పటికే టార్గెట్ నేతలు నగరాలకు వెళ్లినట్లు సమాచారం.
20.కడప జిల్లాలో జగన్ పర్యటన
కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటిస్తున్నారు.వ్యక్తిగత కార్యదర్శి రవి శేఖర్ కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు.