ఏపీలో ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాలలో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు అటు చంద్రబాబు కు సెలబ్రిటీ నుంచి పలువురు ప్రముఖుల నుంచి రాజకీయ నుంచి ప్రశంసలు వెళ్ళు వెత్తుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి.కాగా రేపు అనగా బుధవారం జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్( Kesarapally IT Park ) వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యుడైన జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందా అనే అంశంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ విషయంపై అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
కొందరు ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందని ఎన్టీఆర్ కూడా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఒకవేళ ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా అనే అంశంపైనా ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.ఏపీలో కూటమి ఘన విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని స్పెషల్ పోస్ట్ చేశారు.
ఇక ఎన్టీఆర్ పోస్టుపై చంద్రబాబు కూడా స్పందించిన విషయం తెలిసిందే.దీంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పట్ల కూల్ గా ఉన్నారని కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మరోవైపు టీడీపీ తరపున ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందినా ఆయన వచ్చే అవకాశాలు లేవన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
అలాంటి సమయంలో స్పందించని ఎన్టీఆర్ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు తక్కువని విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరి ఈ విషయంపై పూర్తిగా తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.