తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ( Chandni Choudhary )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాందిని చౌదరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కలర్ ఫోటో.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు కూడా క్యూ కట్టాయి.
ఆ తర్వాత విడుదలైన సమ్మతమే సినిమా కూడా మంచి సక్సెస్ను సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు పెద్దపెద్ద సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగానే ఈమె ప్రస్తుతం వరుసగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో లీడ్ రోల్స్ లో దూసుకుపోతోంది.
![Telugu Balakrishna, Tollywood-Movie Telugu Balakrishna, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/chandini-chowdary-interesting-comments-on-balakrishna-and-nbk-109-moviec.jpg)
త్వరలో బాలకృష్ణ( Balakrishna ) సినిమాలో కూడా కనిపించబోతుంది.డైరెక్టర్ బాబీ ( Director Bobby )దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలకృష్ణ NBK109 సినిమాలో చాందిని చౌదరి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.నిన్న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ సమయంలో బాలయ్యతో దిగిన స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు విషెష్ తెలిపింది చాందిని.అలాగే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాందిని చౌదరి NBK109 సినిమా గురించి, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా చాందిని చౌదరి మాట్లాడుతూ.
![Telugu Balakrishna, Tollywood-Movie Telugu Balakrishna, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/06/chandini-chowdary-interesting-comments-on-balakrishna-and-nbk-109-movieb.jpg)
సినిమా ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ అయిపోయింది.ఇందులో నేను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ చేస్తున్నాను.ఈ సినిమాలో నా పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది.
స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను.కథలో నాది చాలా ఇంపార్టెంట్ ఉన్న పాత్ర.
సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు.సెట్ లో సరదాగా మేమేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ చేసేవాళ్ళం.
షాట్ ఉన్నా లేకపోయినా బాలయ్య గారు సెట్ లోనే ఉంటారు.చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరితో ఈజీగా కలిసిపోతారు అని చెప్పుకొచ్చింది చాందిని చౌదరి.