వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ( Vaishnav Tej, Kriti Shetty )హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఉప్పెన.ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతోనే కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.ఈ సినిమాతో భారీగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) తాజాగా నటించిన చిత్రం మహారాజా.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.ఉప్పెన సినిమా( Uppena movie ) కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేసాను.

ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నాను.చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశాను.మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు.కానీ సినిమా పట్ల బుచ్చి బాబు( Buchi Babu )కున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించాను అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.
ఈ సందర్భంగా విజయ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ సేతుపతి అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.







