సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి( Vastu Shastra ) ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పద్ధతులు పాటిస్తే శుభం జరుగుతుందని ఎంతో మంది ప్రజలు నమ్ముతారు.
ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలను( Plants ) ఇంట్లో పెంచితే అదృష్టం కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ మొక్కలను నాటడానికి కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.
ఈ చెట్లు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు వస్తాయి.ఇంటికి సరైన దిశలో మొక్కలు, చెట్లు నాటితే మనిషి జీవితంలో చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మరి ఇంట్లో ఎలాంటి చెట్లు, మొక్కలు నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పారిజాత మొక్కకు వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.
పారిజాత మొక్క( Parijatha Plant ) లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మొక్క అని చెబుతూ ఉంటారు.ఇంట్లో పారిజాత మొక్కను వాస్తు ప్రకారం నాటితే నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది.ఇంకా చెప్పాలంటే వేప చెట్టుకు కూడా వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వేప చెట్టులోని ప్రతి భాగం వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆయుర్వేదంలో కూడా వేప చెట్టును( Neem Tree ) ఔషధంగా ఉపయోగిస్తారు.అదే విధంగా సనాతన ధర్మంలో వేప చెట్టును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.పండగల సమయంలో మరింత ప్రత్యేకంగా పూజిస్తారు.ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మంలో జమ్మి చెట్టును కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు.
వీటికి పూజలు కూడా చేస్తారు.దసరా పండుగకు జమ్మి చెట్టుకు( Shami Tree ) ఎంతో విశిష్టతగా కొలుస్తారు.ఇంట్లో జమ్మి చెట్టును పెంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అలాగే శనీశ్వరుడు సంతోషిస్తాడని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే దాదాపు చాలా మంది ఇళ్లలో తులసి మొక్క( Tulsi Plant ) కచ్చితంగా ఉంటుంది.
తులసి మొక్కను ఎంత పవిత్రంగా భావిస్తారు.ఈ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా తులసి మొక్క ఉన్నచోట అనారోగ్య సమస్యలు ఉండవని పెద్దవారు చెబుతూ ఉంటారు.
DEVOTIONAL