టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Balayya Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన మంచి మనసు గురించి ఆయన మాట తీరు గురించి మనందరికీ తెలిసిందే.
మాట కఠినంగా ఉన్నా కూడా మనసు మాత్రం వెన్న అని చెప్పవచ్చు.ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు ఒకవైపు సినిమాల పరంగా మంచి సక్సెస్ ను సాధిస్తూనే మరోవైపు రాజకీయపరంగా కూడా సక్సెస్ ను సాధిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం బాలయ్య బాబుకు అదృష్ట కాలం నడుస్తోందనే చెప్పాలి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఒక ప్రశ్న ఆలోచింపజేస్తోంది.

అదేమిటంటే ఈ సరైన బాలకృష్ణకు మంత్రి అవుతారా? అంతటి అదృష్టం బాలయ్య బాబుకు ఉందా అనే ప్రశ్నలు ఎక్కువగా అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.ఒకవేళ బాలయ్య బాబు మంత్రి అయితే ఆయనకు ఏ శాఖలో పదవిని ఇవ్వవచ్చు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.మొదట మంత్రిగా ఉండాలని బాలయ్య బాబుకు ఉందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.సినిమాల పరంగా వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య బాబు నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా హిందూపురం ఎమ్మెల్యేగా (Hindupuram ML )2014, 2019,2024 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా నిలిచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

ఈసారి బాలయ్యను మంత్రిగా చూడాలని అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగానే ఆశపడుతున్నారు.పదవి ఇచ్చి తీరాల్సిందే అనే డిమాండ్ సైతం సర్వత్రా వస్తోంది.ఎందుకంటే 2014 లోనే బాలయ్యకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఎందుకో వర్కవుట్ కాలేదు.ఐతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఏంటి? ఏ శాఖ ఇవ్వొచ్చు? అనేది కూడా చర్చ జరుగుతోంది.హ్యాట్రిక్ ఎమ్మెల్యే మనసులో సినిమాటోగ్రఫీ మంత్రి ఐతే బాగుంటుందని తన అనుయాయులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి ఈ విషయంపై సరైన క్లారిటీ రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.







