బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టర్ పేరుతో నిర్వహించిన ఈ పార్టీకి 150 మంది ప్రముఖులు హాజరయ్యారు.వీరిలో సినీ ఆర్టిస్టులు, వ్యాపారవేత్తలతో పాటు క్రికెట్ బుకీలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
వ్యాపారవేత్త వాసు బర్త్ డే( Businessman Vasu) సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఈ పార్టీకి డ్రగ్స్ పెడ్లర్లు సిద్ధిఖీ, రాజ్, రణధీర్ కూడా హాజరయ్యారన్న పోలీసులు పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించినట్లు తెలిపారు.
ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు వెల్లడించారు.ఈ క్రమంలోనే పార్టీ ఇచ్చిన వాసు గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు.
రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు కొన్ని మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.