సమర సింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల విజయాల తరువాత బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ సమయంలో బాలకృష్ణ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సామి రీమేక్ లో జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో నటించారు.
తెలుగులో లక్ష్మీ నరసింహ 2004 సంవత్సరం జనవరి 14వ తేదీన విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
లక్ష్మీ నరసింహ సినిమా 272 కేంద్రాలలో ఏకంగా 50 రోజులు ప్రదర్శించబడగా 87 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడటం గమనార్హం.
మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.లక్ష్మీ నరసింహ సినిమా రిలీజైన రోజునే విడుదలైన వర్షం సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వచ్చింది.
ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా వర్షం సినిమా నిలవడం గమనార్హం.ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో త్రిష నటించారు.
లక్ష్మీ నరసింహ ఏకంగా 450 కేంద్రాలలో విడుదల కాగా వర్షం సినిమా కేవలం 200 కేంద్రాలలో విడుదలైంది.

వర్షం సినిమా 165 కేంద్రాలలో 50 రోజులు, 68 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.షేర్ విషయంలో లక్ష్మీ నరసింహ, వర్షం సినిమాలు సమానంగా కలెక్ట్ చేయడం గమనార్హం.50 రోజులు, 100 రోజుల సెంటర్ల పరంగా లక్ష్మీ నరసింహ పై చేయి సాధిస్తే లాంగ్ రన్ విషయంలో మాత్రం పై చేయి సాధించింది.

అయితే అదే సమయంలో జనవరి 15వ తేదీన భారీ అంచనాలతో విడుదలైన అంజి సినిమాకు మాత్రం ఫ్లాప్ టాక్ రావడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దాదాపు ఆరు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడం గమనార్హం.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అంజి రిజల్ట్ మెగా ఫ్యాన్స్ ను సైతం బాధ పెట్టింది.