తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో( Bigg Boss reality show ) ఇప్పటి వరకు ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకుంది.ప్రస్తుతం 7 వ సీజన్ నడుస్తుంది.
ఈ సీజన్ కి ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్నీ సీజన్స్ కంటే అత్యధిక రేటింగ్స్ వచ్చాయని బార్క్ సంస్థ కూడా తెలిపింది.అయితే ఇన్ని సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి కొన్ని మ్యాజిక్స్ జరిగాయి.
సీజన్ 2 కౌశల్ సున్నా ఫ్యాన్ బేస్ తో హౌస్ లోకి అడుగుపెట్టాడు.రెండవ వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ హౌస్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా కౌశల్ ఓవర్ నైట్ ఫాలోయింగ్ ని సంపాదించి, అదే రేంజ్ ఫ్లో ని చివరి వరకు కొనసాగించి కప్పు కొట్టుకొని వెళ్ళాడు.
ఇలాగే సీజన్ 5 లో సన్నీ విషయం లో జరిగింది.ఇప్పుడు సీజన్ 7 లో అమర్ దీప్ కి అలాంటి మ్యాజిక్ జరగబోతుంది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
అమర్ దీప్ కి నిన్న మొన్నటి వరకు కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు అనే రేంజ్ ఫాలోయింగ్ అయితే ఉన్నింది.కానీ నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ తో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా టాప్ 1 కి వెళ్ళిపోయింది.ఇక టైటిల్ ఆయనకే ఇచ్చేయొచ్చు అనే స్థాయి మ్యాజిక్ జరిగింది.నిన్న కెప్టెన్సీ టాస్కు( Captaincy task ) లో అమర్ దీప్ ఎంత అద్భుతంగా ఆడాడో మన అందరికీ తెలిసిందే.
చివరి వరకు వచ్చి సొంత స్నేహితుల కారణంగా కెప్టెన్సీ టాస్కు ఓడిపోవడం తో అతను గుండెలు బాదుకుంటూ ఏడ్చిన విధానం అందరినీ ఎంతో బాధకి గురి చేసింది.ముఖ్యంగా గత వారం లో రతికా( Ratika ) కోసం ఆయన తన కెప్టెన్సీ కంటెండర్ షిప్ ని వదిలేసుకున్నాడు, ఈమె వల్ల యావర్ మరియు అమర్ దీప్ కి పెద్ద గొడవ జరిగినా కూడా స్నేహానికి విలువ ఇచ్చి ఆయన నామినేట్ చెయ్యలేదు.
అలాంటి వ్యక్తి పై రతికా టార్గెట్ చేసి అతన్ని కెప్టెన్ కానివ్వకుండా చేసినందుకు అమర్ దీప్ బాగా హర్ట్ అయ్యాడు. గుండెలు పగిలేలా ఏడ్చాడు, మానవత్వమే లేదా అని వాపోయాడు.ఈ ఎపిసోడ్ తో రతికా కి కలలో కూడా ఊహించని రేంజ్ నెగటివిటీ ఏర్పడగా, అమర్ దీప్ కి టైటిల్ ని గెలిచేంత సత్తా ఏర్పడింది.అమర్ దీప్ ని ద్వేషించే వారు కూడా ఈ ఎపిసోడ్ ని చూసి అమర్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంత పాజిటివ్ ఎపిసోడ్ గా మారింది.ఇక నామినేషన్స్ రోజు అయితే అమర్ దీప్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు, చూడాలి మరి.