ఇటీవల కాలంలో గుండె జబ్బులతో( heart disease ) మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.వయసు పైబడిన వారే కాదు వయసులో ఉన్న వారు కూడా గుండె జబ్బులకు గురవుతున్నారు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలి, శరీరానికి శ్రమ లేకపోవడం, చెడు వ్యసనాలు, ఒత్తిడి, అధిక రక్తపోటు తదితర అంశాలు గుండె జబ్బులకు దారి తీస్తాయి.అందువల్ల ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.
ధూమపానం మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.నిత్యం వ్యాయామం చేయాలి.
పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.
ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్ ( Beet root )తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే రెండు ఉసిరికాయలు( amla ) తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు( Ginger slices ), ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి.అలాగే ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని సేవించాలి.
రోజూ ఉదయం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే చాలా లాభాలు పొందుతారు.బీట్‌రూట్ ఆమ్లా జ్యూస్ లో ఉండే ఫోలేట్ రక్తనాళాల నష్టాన్ని నియంత్రిస్తుంది.అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది.
అలాగే ఈ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.నిత్యం బీట్ రూట్ ఆమ్లా జ్యూస్ ను తాగితే హై బీపీకి దూరంగా ఉంటారు.
గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అంతేకాకుండా ఈ బీట్‌రూట్ ఆమ్లా జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి, ఇవి మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి తోడ్పడతాయి.విటమిన్ ఎ దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు వయస్సు-సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.