ప్రతీ జనరేషన్ కి ఇద్దరు సూపర్ స్టార్స్ టాప్ 2 స్థానం లో ఉంటూ ఎవరికీ అందనంత రేంజ్ లో ఉంటారు.అలా ఒకప్పుడు ఎన్టీఆర్ – ఏఎన్నార్, ఆ తర్వాత కృష్ణ – శోభన్ బాబు, ఆ తర్వాతి తరం లో చిరంజీవి – బాలకృష్ణ.
ఇలా వీళ్లంతా తమ జెనెరేషన్స్ లో టాప్ 2 స్టార్స్ గా కొనసాగుతూ వస్తున్నారు.అలా నేటి తరం లో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు టాప్ 2 స్టార్స్ అని, టాలీవుడ్ కి ఈ తరం లో మెయిన్ పిల్లర్స్ వెళ్లే అని ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా 2010 నుండి 2016 వరకు ఈ ఇద్దరి హీరోల క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కి దరిదాపుల్లో వచ్చే హీరోనే లేడు.ఆ స్థాయిలో డామినేషన్ చేసేవాళ్ళు.
నైజాం, ఆంధ్ర ప్రదేశ్ ( Nizam, Andhra Pradesh )మరియు ఓవర్సీస్ మర్కెట్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లిన హీరోలు వీళ్ళే.
అయితే బాహుబలి తర్వాత మన టాలీవుడ్ ( Tollywood )స్థాయి రీజినల్ నుండి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు మహేష్ బాబు( Mahesh Babu ) నుండి ఆ స్థాయి సినిమాలు రాకపోవడం తో పాన్ ఇండియన్ మార్కెట్ లో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ తో పోలిస్తే బాగా వెనుకబడ్డారు.కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ వీళ్లిద్దరు తమ ఆధిపత్యం ని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
అందుకు ఉదాహరణ వీళ్లిద్దరి రీ రిలీజ్ సినిమాలే.ఒక హీరో కి ఫ్యాన్ బేస్ మరియు క్రేజ్ ని ఎలా ఉంటుందో కొలవడం కష్టం.కానీ ఇలా రీ రిలీజ్ చిత్రాల ద్వారా ఒక కొలమానం తీసుకోవచ్చు.ఇప్పటి వరకు స్టార్ హీరోలందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా వీళ్లిద్దరి రికార్డ్స్ ని ముట్టుకోలేకపోయారు.
ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి ‘( pokiri ) సినిమాతో సెన్సేషన్ ని సృష్టించి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పాడు.ఆ తర్వాత ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘జల్సా’ చిత్రాన్ని స్పెషల్ షోస్ గా వేసుకొని భారీ మార్జిన్ తో రికార్డు ని నెలకొల్పారు.ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘ఖుషి’( kushi ) చిత్రాన్ని రీ రిలీజ్ చేసి ఆల్ టైం రికార్డు పెట్టారు.
ఖుషి ఫుల్ రన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయినా, మొదటి రోజు రికార్డు ని మాత్రం బద్దలు కొట్టింది సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ చిత్రం.ఇలా మహేష్ ఒక రికార్డు క్రియేట్ చేస్తే పవన్ బ్రేక్ చేస్తున్నాడు, పవన్ రికార్డు క్రియేట్ చేస్తే మహేష్ బ్రేక్ చేస్తున్నాడు.
ఇలా ఇప్పటికీ ఈ టాప్ 2 స్టార్స్ తమ స్టార్ స్టేటస్ ని మరోసారి నిరూపించుకుంటున్నారు అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.